Monday, 2 November 2026

ఈ పదవి కుటుంబానికి భారమే: ట్రంప్‌

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష పదవి తన కుటుంబానికి భారమేనని అంటున్నారు డొనాల్డ్‌ ట్రంప్‌. అమెరికా అధ్యక్షుడిగా వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో తన అనుభవాలను పంచుకున్నారు. తన భార్య మెలానియా ట్రంప్‌ను మీడియా టార్గెట్‌ చేసి దూషిస్తోందని ఆరోపించారు. వృత్తిపరంగా తాను పెద్ద పదవిలో ఉన్నా మీడియా మాత్రం తనను చిన్నచూపు చూస్తోందని దుయ్యబట్టారు.అమెరికా అధ్యక్ష ఎన్నికల నుంచి ట్రంప్‌ మీడియాపై ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. తాజాగా వంద రోజుల పాలన పూర్తయిన సందర్భంగా ట్రంప్‌ పెన్సిల్వేనియాలోని హ్యారిస్‌బర్గ్‌లో బహిరంగ సభలో ప్రసంగించారు. తన వంద రోజుల పాలనతో సాధించిన విజయాలపై మీడియా కవరేజ్‌ పట్ల ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మీడియాకు వైఫల్య గ్రేడ్‌ ఇవ్వాలని వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *