ఈ వజ్రం విలువ రూ.284 కోట్లట!

అది చాలా అరుదైన 12.03 క్యారెట్ల వజ్రం. దాని పేరు ‘బ్లూ మూన్’. జెనీవాలోని సోత్‌బీ వేలం శాలలో దీన్ని వేలానికి పెట్టగా.. ఏకంగా రూ. 284 కోట్ల ధర పలికింది. ఈ విషయాన్ని సోత్‌బీ ప్రతినిధి ఒకరు తెలిపారు. క్యారట్ వారీగా చూసుకుంటే వజ్రాలకు ఇప్పటివరకు పలికిన అత్యంత ఎక్కువ ధర ఇదేనని చెబుతున్నారు.ఒక్క లోపం కూడా లేని ఈ వజ్రానికి ఇంత ధర రావడం సహజమేనని సోత్‌బీ అంతర్జాతీయ నగల విభాగం అధిపతి డేవిడ్ బెన్నెట్ అన్నారు. తాము మాత్రం దీనికి 231-363 కోట్ల మధ్యలో ఏదో ఒక ధర పలుకుతుందని అనుకున్నామన్నారు.