Wednesday, 4 November 2026

ఉగ్రవాదుల సమాచారంతో ఒక్కసారిగా ఉలిక్కిపడిన పోలీసుశాఖ

 హైదరాబాద్: జానకీపురం ఎన్‌కౌంటర్లో మృతిచెందింది సిమి ఉగ్రవాదులుగా పోలీసులు గుర్తించారు. మధ్యప్రదేశల్‌ని కాండ్వా జైలు నుంచి 2013 అక్టోబర్‌ 1న తప్పించుకున్న ఐదుగురు ఉగ్రవాదుల్లో వీళ్లు ఇద్దరని పోలీసులు నిర్ణారించారు. అయితే జైలు నుంచి తప్పించుకున్న మరో ముగ్గురు ఉగ్రవాదులైన మహ్మద్‌ ఇజాజుద్దీన్‌, అమ్జద్‌ఖాన్‌, అబ్దుల్‌ఫైజల్ కోసం పోలీసులు విస్త్రతంగా గాలిస్తున్నారు. ఈ ముగ్గురు ఉగ్రవాదులు కూడా ఇక్కడే ఉండొచ్చన్న సమాచారంతో పెద్ద ఎత్తున పోలీసులు కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు. గ్రేహౌండ్స్‌, ఆక్టోపస్ బృంధాలు పెద్ద ఎత్తున రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *