హైదరాబాదీలను అవమానించేలా ఉందని వ్యాఖ్య
హైదరాబాద్,నవంబర్22(జనంసాక్షి): కేసీఆర్ కు అమ్ముడు పోయినందుకు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీకి ప్రత్యుపకారంగా ఏం వచ్చిందో తెలపాలన్న టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యకు.. అసదుద్దీన్ ఘాటుగా స్పందించారు. 50 వేల మంది ముస్లిం బాలబాలికలకు రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్య, 800 మంది మైనారిటీ విద్యార్థులకు ఓవర్సీస్ స్కాలర్షిప్స్ అందాయన్నారు. అంతేకాక.. తెలంగాణలో మత కలహాలు లేవని, కడుపేదవాడు కూడా సుఖశాంతులతో జీవిస్తున్నాడన్నారు. ఇక మమ్మల్ని ఎంతకు కొన్నారన్న విూ ప్రశ్న ప్రతి హైదరాబాదీని అవమానిస్తుందంటూ ఘాటుగా సమాధానం ఇచ్చారు.




