ఉత్తమ అవార్డు పొందిన ఉద్యోగి…. 

మహిళా, పిల్లల, దివ్యాoగుల మరియు వయో వృద్దుల సంక్షేమ శాఖ, వరంగల్ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ లోని విధులు నిర్వహిస్తున్న జూనియర్ అసిస్టెంట్ ఆర్. ఇంద్ర సేనా రెడ్డికి , 2022 తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఉద్యోగిగా గా అవార్డ్ రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ రాజ్ మరియు అభివృద్ధి శాఖ మాత్యులు శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారి నుండి ఉత్తమ ప్రశంసా పత్రం అందుకోవడం జరిగింది.
2001 లో ఉద్యోగం లోకి చేరిన తరువాత 2011 లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉత్తమ ఉద్యోగిగా మరియు 2022 లో ఇది రెండోసారి కావడంతో సంతోషంగా ఉందని ఇంద్ర సేనా రెడ్డి తెలిపారు, ఈ అవార్డ్ తో తన మీద మరింత బాధ్యత పెరిగిందని ప్రభుత్వం తరఫున తమ శాఖ తరపున ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేస్తానని, అవార్డ్ వచ్చినందుకు జిల్లా ఉన్నత అధికారుల సహకారంతో, సేవలు అందిస్తానని ఉత్తమ అధికారిగా అవార్డు అందుకున్నందుకు వ్యక్తం చేస్తూ తన తోటి ఉద్యోగులకు మరియు జిల్లా స్థాయి మహిళా శిశు సంక్షేమ శాఖ జిల్లా స్థాయి ఉద్యోగులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు చెప్పడం జరిగింది.