న్యూఢిల్లీ,జనవరి23(జనంసాక్షి):ఉత్తర భారతాన్ని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ఎడతెగని వర్షాలతో డిల్లీ, యూపీ, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జమ్ముకశ్మీర్‌లు అతలాకుతలం అవుతున్నాయి. ఢిల్లీలో కురుస్తున్న వర్షాలతో రహదారులపై భారీగా నీరు నిలిచిపోయింది. అనేక ప్రాంతాల్లో రోడ్లు నదులను తలపిస్తున్నాయి. ఛాతర్‌పూర్ ప్రాంతంలో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇటు జమ్ము కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ తదితర రాష్టాల్లో ఓ వైపు మంచు..మరోవైపు వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఉదంపూర్ లో మంచు చరియలు విరిగిపడి వల్ల ఇద్దరు వ్యక్తలు మరణించారు. కాశ్మీర్‌లో జాతీయరహదారులను మూసేసారు. దీంతో వాహనాలు ఎక్కడిక్కడే నిలిపేశారు.
ఉత్తరభారతాన్ని వణికిస్తున్న అకాల వర్షాలు




