విజయవాడ,(జనంసాక్షి): ఉత్తరాఖండ్ విపత్లులో తెలుగు యాత్రికులు చాలా మంది మృతి చెందినట్లు కృష్ణా జిల్లా దేవరపల్లికి చెందిన కొల్లి సీతారావమ్మ (68) తెలిపారు. సీతారావమ్మతో పాటు మొత్తం 20 మంది కేదార్‌నాథ్‌కు వెళ్లారు. ఆ వివరాలను ఆమె వెల్లడించారు. కేదారినాథ్‌లో తన కళ్లముందే ఏడుగురు కొట్టుకుపోయారని ఆమె చెప్పారు. ఇద్దరు చనిపోవడం తాను చేసినట్లు తెలిపారు. అంతా వస్తే కాని ఎంతమంది మరణించారో తెలియదన్నారు. సీతారావమ్మను ఆర్మీ కేదారినాథ్ నుంచి గౌచెరీకి తరలించారు.




