ఉద్యోగార్థులకు మరింత సౌకర్యం
పట్టణంలో ఆర్మీ, పోలీసు తదితర ఉద్యోగాలకు సన్నధం అయ్యే యువత కోసం రన్నింగ్, లాంగ్ జంప్ ట్రాక్ లు సిధ్ధం చేసినట్లు బోథ్ సర్పంచ్ సురేందర్ యాదవ్ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ ఇటీవలే రన్నింగ్ ట్రాక్ పనులు పూర్తి చేసి సిధ్ధం చేశామనీ, మరో రెండు రోజుల్లో లాంగ్ జంప్ ట్రాక్ అందుబాటులోకి వస్తుందని తెలిపారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.