Tuesday, 3 November 2026

ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసగించిన విశ్రాంతి ఉద్యోగి అరెస్టు

పెద్దాపురం : ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ యువకులను మోసగించిన కేసులో విశ్రాంతి మైక్రో ఇరిగేషన్‌ పిడీ సవరపు వేణుగోపాల్‌రావును తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వేణుగోపాలరావు పెద్దాపురం, అమలాపురం, కాకినాడకు చెందిన 20 మంది నుంచి సుమారు రూ.40 లక్షలు వసూలు చేశారు. తమకు ఉద్యోగాలు ఇప్పించకపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *