హైదరాబాద్,సెప్టెంబర్6 (జనం సాక్షి ) : రాష్ట్రంలో ఉన్నత విద్యను పటిష్ఠపరిచేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతున్నదని విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి చెప్పారు. విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కాకుండా వారు పారిశ్రామికవేత్తలుగా తయారయ్యే విధంగా.. ఉన్నత విద్యలో సమూలమైన మార్పులు రావాల్సి ఉందని చెప్పారు. అటు విదేశి యూనివర్శిటిల కోలాబరేషన్ తోనూ రాష్ట్ర యూనివర్శిటిల్లో విద్యా ప్రమణాలు పెంచే విధంగా ప్రభుత్వం పని చేస్తున్నదని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి తెలిపారు. హైదరాబాద్ బ్రిటిష్ కౌన్సిల్స్ ఆధ్యర్యంలో జరుగుతున్న యుకె-ఇండియా పాలసీ డైలాగ్ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్ సదస్సుకు మంత్రి జగదీష్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి, విద్యాశాఖ ఉన్నతాధికారులు, బ్రిటిష్ కౌన్సిల్ ప్రతినిధులు పాల్గొన్నారు.
ఉన్నత విద్యకు ప్రోత్సాహం మంత్రి జగదీశ్వర్ రెడ్డి




