చోరీలకు పాల్పడుతున్న ఆటో డ్రైవర్ అరెస్ట్
హైదరాబాద్,సెప్టెంబర్6 (జనం సాక్షి ) : కల్లు కంపౌండ్‌కు వచ్చే ఒంటరి మహిళలే టార్గెట్‌గా దోపిడీకి పాల్పడుతున్న మధావత్ గంగ్యా అనే నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఎల్బీనగర్ డీసీపీ కార్యాలయంలో నిందితుడికి సంబంధించిన వివరాలను డీసీపీ సన్‌ప్రీత్ సింగ్ వెల్లడించారు. ఆటో డ్రైవర్‌గా పని చేస్తూ నేరాలకు పాల్పడుతన్న నిందితుడి నుంచి ఆరు లక్షల పది వేల విలువైన 98 గ్రాముల బంగారం, 100 గ్రాముల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. బాధిత మహిళల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ టీవీ పుటేజీలో నిందితుడి ఆటోను గుర్తించారు. అనుమానాస్పదంగా కర్మన్‌ఘాట్ చౌరాస్తాలో తిరుగుతుండగా అదుపులోకి తీసుకుని విచారించినట్లు వెల్లడించారు. కల్లు తాగిన తరువాత మత్తులో ఉన్న మహిళలను తన ఆటోలో ఎవరూ లేని ప్రదేశాలుకు తీసుకెళ్లి దోపిడీకి పాల్పడినట్లు నిందితుడు అంగీకరించాడని తెలిపారు.
కల్లు కాంపౌండ్ వద్ద మహిళలే లక్ష్యం




