ఉమ్మడి సర్వీసు నిబంధనలు కొనసాగించాలి
చిత్తూరు,ఏప్రిల్20(జనంసాక్షి): ఉపాధ్యాయులపై కక్ష సాధింపు సరికాదని ఏపీటీఎఫ్ జిల్లా నాయకులు రఘురామిరెడ్డి అన్నారు. ఉమ్మడి సర్వీసు నిబంధనలకు తూట్లు పరిచే విధంగా తీసుకొచ్చిన ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని పేర్కొన్నారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కేటగిరి-3లో ఉన్న సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు, క్యాటగిరీ-2లోని పాఠశాల సహాయకులు తెలుగు, హిందీ పోస్టులకు అర్హత ఉన్నా పదోన్నతులకు నిరాకరించడం భావ్యం కాదన్నారు.