హైదరాబాద్,మే3(జనంసాక్షి): హైదరాబాద్ నగరంలోని వారాసిగూడలో నిర్వహించిన ఉర్సు ఊరేగింపు కార్యక్రమంలో అపశ్రుతి చోటు చేసుకుంది. ఊరేగింపులో ఉపయోగించిన టాటాఏస్ వాహనం జనాల విూదకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్ డ్యాన్స్ చేస్తుండగా, మైనర్ బాలుడు వాహనం నడపడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్దారించారు. క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఉర్సు ఊరేగింపులో అపశృతి: ఒకరు మృతి




