Monday, 2 November 2026

రాగులు తీసుకెళ్లినందుకు అబుదాబిలో పదిరోజలు జైలు

కంపెనీ పూచీకత్తుతో విడుదలైన హైదరాబాదీ
హైదరాబాద్‌,మే3(జ‌నంసాక్షి): రాగులు తీసుకెళ్లిన ఓ సాఫ్ట్వేర్‌ ఇంజనీర్‌ అబుదాబిలో పదిరోజులు జైలు పాలయ్యారు. వాటి గురించితెలియని కస్టమ్స్‌ అధికారులు వాటిని లాబరేటరీకి పంపి పరిశీలించిన తరవాత విడుదల చేశారు. వివరాల్లోకి వెలితే…రాగులు తినడం ఆరోగ్యానికి మంచిదని భావించి హైదరాబాద్‌ నుంచి వాటిని తీసుకెళ్లిన సాప్ట్‌వేర్‌ ఇంజనీర్‌ను అక్కడి కస్‌ట్మ్స్‌ అధికారులు ఎయమిర్‌పోర్టలోనే అరెస్ట్‌ చేశారు. . హైదరాబాద్‌ అంబర్‌పేటలోని మారుతీనగర్‌కు చెందిన 37 ఏళ్ల కట్టకపు సంతోష్‌రెడ్డి యూఏఈలో సాప్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. ఇటీవల 2 కిలోలున్న 4 రకాల రాగులను హైదరాబాద్‌ నుంచి తీసుకొస్తుండగా.. అబుదాబి విమానాశ్రయంలో కస్టమ్స్‌ అధికారులు అరెస్టు చేశారు. రాగులను పరీక్షల నిమిత్తం ల్యాబొరేటరీకి పంపించిన అధికారులు.. నివేదిక వచ్చే వరకూ దేశం విడిచి వెళ్లకుండా పాస్‌సోర్టును స్వాధీనం చేసుకున్నారు. 10 రోజులు అతడిని జైలులోనే ఉంచారు. సంతోష్‌రెడ్డి పనిచేస్తున్న యాజమాన్యం ఇచ్చిన పూచికత్తుపై అతడికి బెయిల్‌ మంజూరు చేశారు. సాధారణంగా ఇలాంటి పదార్థాలు తీసుకుని వెళ్లాలా వద్దా అన్నది ఆలోచన చేయకపోవడంతో శిక్ష తప్పలేదు.