ఉల్లి దిగుమతులకు టెండర్లు

4srkhhv8ప్రభుత్వరంగ సంస్థ ఎమ్‌ఎమ్‌టిసి.. పాకిస్తాన్, ఈజిప్టు, చైనా, అఫ్ఘనిస్తాన్‌ల నుంచి 10,000 టన్నుల ఉల్లి దిగుమతులకుగాను టెండర్లను ఆహ్వానించింది. దేశీయంగా ఉల్లి ధరలు ఆందోళనకర స్థాయికి చేరిన నేపథ్యంలో డిమాండ్‌కు తగ్గ సరఫరా కోసం విదేశాల నుంచి ఉల్లి దిగుమతులకు సిద్ధమైంది కేంద్ర ప్రభుత్వం. ఈ క్రమంలోనే ఎమ్‌ఎమ్‌టిసి టెండర్లను పిలవగా, సెప్టెంబర్ 4లోగా దాఖలు చేయాలని కోరింది. 15వరకు ఉల్లి భారత్‌కు చేరేలా ఏర్పాటు చేస్తోంది