హైదరాబాద్,సెప్టెంబర్ 12,(జనంసాక్షి):నాలుగు సంవత్సరాల తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయానికి తిరిగి న్యాక్ గుర్తింపు లభించింది. న్యాక్ యూనివర్సిటికి ‘ఎ ప్లస్’ గ్రేడ్ ఇచ్చింది. ఆగస్టు 16, 17 తేదీల్లో న్యాక్ బృందం ఉస్మానియాను సందర్శించింది. వర్సిటీలోని పలు డిపార్ట్‌మెంట్లు, హెల్త్ సెంటర్, స్పోర్ట్స్ గ్రౌండ్స్, రీసెర్చ్ పబ్లికేషన్స్, ల్యాబొరేటరీస్, పీహెచ్‌డీ అవార్డుల ప్రదానం, విద్యార్థులు, అధ్యాపకులతో విడివిడిగా ముఖాముఖి సమావేశాల జరిపింది. వర్సిటీలోని సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేసిన న్యాక్ టీం తాజాగా ఉస్మానియా యూనివర్సిటీకి ‘ఎ ప్లస్’ గ్రేడ్‌ను ప్రకటించింది. దీంతో నిధుల రాక పెరగనుంది. శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఉస్మానియా విశ్వవిద్యాలయానికి జాతీయ స్థాయిలో అత్యున్నత గుర్తింపు లభించింది. నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్(న్యాక్) ఇచ్చిన గుర్తింపులో ఓయూ ‘ఏ ప్లస్’ ర్యాంకు సాధించింది. జేఎన్‌టీయూ, కాకతీయ విశ్వవిద్యాలయాలు ‘ఏ’ గ్రేడ్ గుర్తిపును పొందాయి.నిజాం కాలంలో స్థాపించిన ఉస్మానియా విశ్వవిద్యాలయానికి జాతీయ స్థాయి ¬దా దక్కడంతో విద్యార్థులు, అధ్యాపకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 2013 తర్వాత ఈ విశ్వవిద్యాలయం గ్రేడింగ్‌కు దరఖాస్తు కూడా చేయలేదు. శాశ్వత ప్రాతిపదికన ఉపకులపతి లేకపోవడం, ఇతర సమస్యలే దీనికి కారణం. ప్రస్తుతం విశ్వవిద్యాలయానికి అన్ని వసతులూ సమకూరడంతో పాటు వీసీ నియామకం కావడంతో యూజీసీ ‘ఏ ప్లస్’ ¬దా ఇచ్చింది. దీంతో నేషనల్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్, స్టూడెంట్స్ ఫెలో షిప్స్, యూజీసీ డెవలప్‌మెంట్ ఫండ్స్, రూసా వంటి నిధులు అధిక మొత్తంలో ఉస్మానియాకు యూజీసా కేటాయించనుంది.




