హైదరాబాద్,సెప్టెంబర్ 12,(జనంసాక్షి):తెలంగాణ పురపాలక సంఘాల్లోని పారిశుద్ధ్య కార్మికుల సంఘాలతో పురపాలక శాఖ మంత్రి కెటి రామారావు ఈ సమావేశం అయ్యారు. పారిశుద్య కార్మికుల సమస్యలను మంత్రి ఈ సందర్భంగా అడిగి తెలుసుకున్నారు. కార్మికుల సమస్యలను తెలుసుకున్న మంత్రి, వారు అడగకున్న కార్మికుల అరోగ్య పరిరక్షణ కోసం ఒక హెల్త్ కార్డు తీసుకుని వచ్చే అంశాన్ని పరిశీలించాలని అధికారులను కోరారు. కార్పోరేషన్లు, మున్సీపాలీటీల్లోని అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లలో కార్మికులతో పనిచేయించుకుంటే అయా కవిూషనర్లదే భాద్యత వహించాలన్నారు. ఇలాంటి సంఘనలను నేరుగా తనకు, తన కార్యాలయానికి సమాచారం ఇస్తే వేంటనే అయా కవిూషనర్లను సస్పెండ్ చేస్తామని మంత్రి కార్మికులకు తెలిపారు. కార్మికులు పట్ల తమకు పూర్తి గౌరవం ఉందని, వారు నగరానికే పని చేయాలని, అధికారులకు, ప్రజాపత్రినిధులకు కాదని తెలిపారు. కార్మికులకు అవసరం అయిన సెఫ్టీ ఎక్విప్ మెంట్ ఇచ్చామని, అవసరం అయినంత మేరకు సరఫరా చేస్తామని తెలిపారు. కానీ ఈ సామగ్రి వాడేలా కార్మికులను చైతన్యపరచాలని కోరారు. తమకు వేతనాలు పెంచాలని, ఈయస్ ఐ, పియఫ్ సౌకర్యాల కల్పన, డబుల్ బెడ్ రూం ఇళ్లు, సమాన పనికి సమాన వేతనమంటూ సుప్రీం కో ర్టు ఇచ్చిన తీర్పు అమలు, సెఫ్టీ ఎక్విప్ మెంట్ వంటి పలు డిమాండ్లను మంత్రి దృష్టికి కార్మికులు తీసుకుని వచ్చారు. తెలంగాణలో అన్ని శ్రామిక వర్గాలకు, ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం జీతాలు పెంచిదన్నారు. పట్టణాల్లో పరిశుభద్రత కాపాడుతున్న పారిశుధ్ద్య కార్మికులను దేవుళ్లతో సమానంగా పోల్చిన ముఖ్యమంత్రి కెసియార్ గారని, అయనకు పారిశుద్ద్య కార్మికుల సమస్యలపైన అయనకు పూర్తి అవగాహన, సానూభూతి ఉందన్నారు. తెలంగాణ పారిశుద్ద్య కార్మికుల సమస్యలను ముఖ్యమంత్రికి తీసుకెళ్తామన్నారు. పురపాలికల్లో అర్ధిక పరిపుష్టి ఉన్న మున్సిపాలీటీల్లో జీతాలు పెంచిన ఏలాంటి ఇబ్బంది ఉండదని, కానీ నగర పంచాయితీలు, చిన్న మున్సీపాలీటీల్లో ఏలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపైన శాఖపరంగా తీసుకోవాల్సిన చర్యలపైన చర్చిస్తామన్నారు. జీతాల పెంచితే పురపాలక శాఖపైన పడే అదనపు అర్థిక భారం ఏంత పడుతుందో తెలిపేలా ఒక నివేదిక ఇవ్వాలని మంత్రి అధికారులకు అదేశాలిచ్చారు. కార్మిక నాయకులకు ఈయస్ ఐ, మరియు ప్రావిడెంట్ ఫండ్ విషయంలో చిత్తశుద్దితో ఏలాంటి ఇబ్బంది లేకుండా ఈ రెండు సౌకర్యాల అమలు చేస్తామన్నారు. సుప్రీం కోర్టు ఇచ్చిన అదేశాల అమలు విషయంలో కొంత సమయం కావాలని కోరారు. కొన్ని నెలలుగా పారిశుద్ద్య కార్మికులకు జీతాలివ్వని మున్సీపాలీటీల కవిూషనర్లతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేస్తామని హవిూ ఇచ్చారు. పెండింగ్ బకాయిలను చెల్లించేందుకు అవసరం అయిన మేరకు సహాకరిస్తామని తెలిపారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకంలో ఇళ్లు లేని అర్హులైన పారిశుద్ద్య కార్మికులకు ఇళ్లిస్తామని మంత్రి తెలిపారు. అవసరం అయితే ప్రత్యేకంగా కోటా ఇచ్చే అంశాన్ని భవిష్యత్తులో పరిశీలన చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో వివిధ జిల్లాల నుంచి వచ్చిన కార్మిక సంఘాల నాయకులు, మున్సిపల్ శాఖాధికారులు పాల్గోన్నారు.
మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తాం





