– గ్రేటర్ పీఠం మాదే
– స్మార్ట్ సిటీలపై కేంద్రం వివక్ష
– జర్నలిస్టులకు డబుల్‌బెడ్‌రూం ఇల్లు కట్టిస్తాం
– సీఎం కేసీఆర్ వెల్లడి
హైదరాబాద్,జనవరి28(జనంసాక్షి):మజ్లిస్ పార్టీ తమకు మిత్రపక్షమని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఎంఐఎం ఫ్రెండ్లీ పార్టీ అని తెలంగాణ భవన్ లో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన తెలిపారు. ఎవరు ప్రధానంగా పోటీ ఇస్తారని భావిస్తున్నారన్న ప్రశ్నకు నేరుగా సమాధానం ఇవ్వని కేసీఆర్.. ఆ తర్వాత వేరే సందర్భంలో ఈ విషయాన్ని చెప్పారు. గతంలో కాంగ్రెస్ పార్టీతో కలిసి అధికారాన్ని పంచుకున్న మజ్లిస్ పార్టీ.. ఇప్పుడు టీఆర్‌ఎస్‌తో చేతులు కలుపుతుందన్న సంకేతాలను సీఎం సూచనప్రాయంగా ఇచ్చారు. పేదలు ఆత్మగౌరవంతో బతకాలన్నది టీఆర్‌ఎస్ ఉద్దేశమని, అందుకే రూ. 40 వేల కోట్లను సంక్షేమ పథకాలకు కేటాయించామని అన్నారు. ఇప్‌ఉడు పరివ్రమలకు కూడా 24 గంటలు విద్యుత్ ఇస్తున్నామని చెప్పారు. ఒకప్పుడు కంపెనీలలో విద్యుత్ కోతల వల్ల కార్మికులకు వారానికి రెండు రోజులు ఉపాధి ఉండేది కాదని, ఇప్పుడు తామిచ్చే కరెంటు వల్ల అలాంటి పరిస్థితి లేకుండా పోయిందని చెప్పారు. తాము అధికారంలోకి వస్తే నీళ్లు ఫ్రీగా ఇస్తామని కాంగ్రెస్ ప్రచారం చేస్తోందని, అసలు వాటర్ బోర్డు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటే.. ఒకవేళ వాళ్లు గెలిచినా అలాంటి నిర్ణయం ఎలా తీసుకోగలరని సీఎం ప్రశ్నించారు. ఆకతాయిల ఆగడాలకు షీ టీమ్స్‌తో చెక్ పెట్టామని, ఆటోరిక్షాలకు పన్ను రద్దు చేశామని, రూ. 30 వేల కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని, లక్షల మంది పేదలకు పట్టాలిచ్చామని కేసీఆర్ చెప్పారు. భాగ్యనగరంలో మురుగునీరు పోగొట్టాలంటే రూ. 12 వేల కోట్లు ఖర్చుపెట్టాలని, దానికి సుమారు 3 ఏళ్ల కాలం పడుతుందని అన్నారు. ఈ దుస్థితి కాంగ్రెస్, టీడీపీల పుణ్యమా అనే నెలకొందని మండిపడ్డారు. డ్రైనేజి సిస్టం అంతా కాంగ్రెస్, టీడీపీల హయాంలో కబ్జాలలో కూరుకుపోయిందన్నారు. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పాలించిన చంద్రబాబు.. తాను లేవనెత్తిన అంశాలను ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో ఉన్న ఏ రాష్ట్ర వాసైనా తెలంగాణ బిడ్డేనని కేసీఆర్ తెలిపారు. చంద్రబాబు ఊడ్చడానికి ఆ రాష్ట్రంలో 13 జిల్లాలు ఉన్నాయని, హైదరాబాద్‌ను ఆయన ఇంకేం ఊడ్చుతారని ఎద్దేవా చేశారు. బ్రిక్స్ బ్యాంక్ నుంచి రూ. 25 వేల కోట్లు తెచ్చి, హుస్సేన్‌సాగర్‌ను పరిశుభ్రం చేస్తామని తెలిపారు.్యంది. కాగా జర్నలిస్టులకు డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టిస్తామని సీఎం తెలిపారు. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఈ-క్యాంపెయిన్‌కు సహకరించి, ప్రశ్నలు అడిగి నాతో సమాధానాలు చెప్పించి ప్రజలకు విూ ద్వారా తన సందేశాన్ని తీసుకెళ్లి సహకరించిన జర్నలిస్టు మిత్రులందరికి నమస్కారం తెలియజేస్తున్నానని సీఎం కేసీఆర్ తెలిపారు. తెలంగాణ భవన్‌లో విూడియాతో ముఖాముఖి ముగింపు సందర్భంగా సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ పథకాలను, ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్న విూడియా, జర్నలిస్టు మిత్రులందరికి ధన్యవాదాలు తెలిపారు. ఇక జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో విూరు, విూతో పాటు మరికొందరిని టీఆర్‌ఎస్‌కు ఓటు వేయించాలని కోరుతునాన్ని సీఎం అన్నారు. జై తెలంగాణ అంటూ ముఖాముఖి ముగించారు. అలాగే వారికి ఇళ్ల సమస్యను సంవత్సరంలోగా తీరుస్తానని అన్నారు. జర్నలిస్టులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తారా? లేదా స్థలాలు ఇస్తారా? అని ప్రశ్నించగా దీనిపై సీఎం స్పందిస్తూ.. జర్నలిస్టులందరికి ఇండ్లు రావాలనేదే తమ అభిమతమన్నారు. ఇందు కోసం అందరం కలిసి కూర్చుండి మాట్లాడుకుని పనులు ప్రారంభించుకుందామన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టించి ఇస్తామని తెలిపారు. అయితే జర్నలిస్టులకు అందరిలా కాకుండా కొంత స్థలం ఎక్కువగా ఉండేలా నిర్మించి ఇస్తామని తెలిపారు. 580 చదరపు అడుగులు కాకుండా ఏడు నుంచి ఎనిమిది వందల చదరపు అడుగుల విస్తీర్ణంలో కట్టించి ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. జర్నలిస్టులకు గర్వంగా ఉండేలా జర్నలిస్టు కాలనీ కట్టుకుందామన్నారు. ఇందులో రాజకీయాలు తావు లేదన్నారు. దీని కోసం తానే త్వరలో శంకుస్థాపన చేస్తానన్నారు. ఏడాదిలోపు జర్నలిస్టులందరికి ఇండ్లు కట్టించి ఇస్తామని ప్రకటించారు. జర్నలిస్టులందరూ తమకు సమానమేనని తెలిపారు. జిల్లాలతోపాటు అందరికి ఇండ్లు రావాలని ఆన్నారు. దీనికోసం కమిటీ వేసుకుని ముందుకు పోదామని అన్నారు. కాగా ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేస్తాం అని సీఎం కెసిఆర్
శాంతిభద్రతల పరిరక్షణలో ఎలాంటి రాజీలేదని సిఎం కెసిఆర్ అన్నారు. ఉగ్రవాదం,తీవ్రవాద ఏ రూపంలో ఉన్నా ఉక్కుపిడికిలితో అణచివేస్తామని అన్నారు. రాష్ట్రంలో ఉగ్రవాదాన్ని ఉపేక్షించబోమని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. దానిని ఉక్కు చేతితో అణచివేస్తామని వెల్లడించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్బంగా తెలంగాణభవన్‌లో విూడియా సమావేశంలో మాట్లాడుతూ ఉగ్రవాదంపై ఓ విలేకరి ప్రశ్నించగా సీఎం పైవిధంగా స్పందించారు. తెలంగాణలో ఉగ్రవాద, అసాంఘీక శక్తుల ఆటలు సాగనీయబోమని తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు ఉంటేనే పెట్టుబడులు వస్తాయని వివరించారు. లేకుంటే పెట్టుబడులు రావని తెలిపారు. పెట్టుబడులు వస్తేనే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. త్వరలో పోలీస్ కంట్రోల్ రూమ్ పనులు వేగవంతం చేస్తామన్నారు. దీని ద్వారా శాంతి భద్రతలు పరిరక్షించడం జరుగుతుందన్నారు. డైనమిక్ ప్రభుత్వం ఉంటే డైనమిక్ నిర్ణయాలు ఉంటాయని లేకుంటు ఆందోళనలు కూడా వస్తాయన్నారు. నగరంలో షీ టీమ్స్ ఏర్పాటు, సిసి కెమెరాల ఏర్పాటు ఇందులో భాగమన్నారు. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పాలించిన చంద్రబాబు.. తాను లేవనెత్తిన అంశాలను ఎందుకు పట్టించుకోలేదని సిఎం కెసిఆర్ ప్రశ్నించారు. హైదరాబాద్‌లో ఉన్న ఏ రాష్ట్ర వాసైనా తెలంగాణ బిడ్డేనని కేసీఆర్ తెలిపారు. చంద్రబాబు ఊడ్చడానికి ఆ రాష్ట్రంలో 13 జిల్లాలు ఉన్నాయని, హైదరాబాద్‌ను ఆయన ఇంకేం ఊడ్చుతారని ఎద్దేవా చేశారు.అమరావతి రాజధాని నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం తరపున ఎంతో కొంత విరాళం ఇద్దామనుకుని వెళ్లానని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ వెల్లడించారు. అమరావతి వెళ్లడానికి ముందు తెలంగాణ మంత్రులు,ఇతర పెద్దలతో ఆలోచించినప్పుడు ,ఇలా విరాళం ఇవ్వడం బాగుంటుందని అనుకున్నామని ఆయన అన్నారు. కాని ప్రధాని మోడీ వచ్చి అక్కడ మట్టి,నీరు ఇచ్చినట్లు తెలిసిన తర్వాత తాను ఏవిూ మాట్లాడకుండా వెనక్కి వచ్చేశానని కెసిఆర్ తెలిపారు. మోడీ ఏవిూ ప్రకటించకుండా, తాను ఏమైనా విరాళం ప్రకటిస్తే మోడీ బాధపడతారనుకుని వచ్చేశానని అన్నారు. ఈ విషయం చంద్రబాబుకు, యనమల రామకృష్ణుడుకు కూడా చెప్పానని కెసిఆర్ అన్నారు. వారికి సింగపూర్, జపాన్ లు కడతాయని అంటున్నారని ఒక విలేకరి అనగా, ఆ విషయాలు తనకు తెలియవని ,అమరావతితో రాజకీయం చేసేవారిని అడగండని అన్నారు. చంద్రబాబుతో ఉన్నది రాజ్యాంగపరమైన స్నేహమేనని ఆయన అన్నారు. హిళలకు మంత్రివర్గంలో స్థానం కల్పించలేదన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ తమకు ఉన్నదాని ప్రకారం పదిహేడు మంది మంత్రులకే అవకాశం ఉందని అన్నారు. మహిళలకు మంత్రివర్గంలో కచ్చితంగా ఇవ్వాలన్న నిబంధన లేదని కెసిఆర్ అన్నారు.





