Monday, 2 November 2026

ఆర్థిక ఇబ్బందులతో పిల్లలతోసహా తల్లి ఆత్మహత్య

x9a44e42హైదరాబాద్‌ : జూబ్లీహిల్స్‌లోని వినాయక్‌నగర్‌లో దారుణం జరిగింది. ఆర్ధిక ఇబ్బందులు భరించలేని ఓ తల్లి తన ఇద్దరు చిన్నారులకు విషమిచ్చింది. దీంతో మూడేళ్ల ప్రత్యూష, 9 నెలల శ్రావణి మృతి చెందారు. ఆ తర్వాత తల్లి సరిత కూడా ఊరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీంతో సరిత కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *