రెండు మూడు రోజుల పాటూ రాష్ట్రంలో ఎండలు విపరీతంగా ఉండొచ్చని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణపై ఉపరితల ఆవర్తన ద్రోణి ఆవరించి ఉన్నప్పటికీ.. దాని ప్రభావం పెద్దగా కనిపించడం లేదన్నారు అధికారులు. మే చివరి వరకూ రాష్ట్రంలోని పలు చోట్ల ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు తగ్గకుండా ఉంటాయని, అవి 47 డిగ్రీలకు పెరిగే అవకాశం కూడా ఉందన్నారు. ఎండ ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప ఎండలో బయటకు వెళ్లకూడదని అధికారులు సూచిస్తున్నారు





