హైదరాబాద్,మే22(జనం సాక్షి): ఎంసెట్ 2018 ఫలితాలు వెల్లడయ్యాక ఈ నెల 25 నుంచి ధ్రువపత్రాల పరిశీలన.. వెను వెంటనే వెబ్ ఐచ్ఛికాల నమోదు కానుంది. దీంతో విద్యార్థులు సీట్ల సంఖ్యను, కాలేజీల కోర్సులను ఆరా తీస్తున్నారు. మరోవైపు ప్రైవేట్ కాలేజీలు కూడా తమవంతుగా ప్రచారం ముమ్మరం చేశాయి. దీనికితోడు ఇంజనీరింగ్‌పై ఆసక్తి కూడా తగ్గింది. ఈ నేపథ్యంలో ఇంజనీరింగ్ కోర్సులు, సీట్లపై విద్యార్థుల్లో ఆసక్తి నెలకొనడం సర్వసాధారణం. జిల్లాల్లో ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలు ఏఐసీటీఈ అనుబంధ ¬దా పొందినవి, పొందనివి ఉన్నాయి. దీని ఆధారంగా జేఎన్‌టీయూహెచ్ అనుబంధ గుర్తింపునతో పాటు సీట్లలో కోత విధించేందుకు అధికారం కలిగి ఉంది. కొన్ని రోజులుగా విడతల వారీగా అనుబంధ గుర్తింపు జారీ చేస్తూ వస్తోంది. ఇప్పటివరకు జిల్లాలోని కళాశాలల్లో ప్రవేశాలకు మార్గం సుగమమైంది. సీట్ల విషయంలో అధికారింగా ప్రకటన ఏదీ వెలువడలేదు. ఈనెల 24న వెబ్‌సైటులో అందుబాటులో ఉండే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా అనుబంధ గుర్తింపు ¬దా ఇవ్వడం పూర్తి
కాకపోవడంతో ఇతర కళాశాలల వివరాలను అధికారిక వెబ్‌సైటులో నమోదు చేయలేదని తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం మేరకు ప్రైవేటు కళాశాలల్లో ఏ, బి కేటగిరీలో మొత్తం సీట్లలో ప్రవేశాలకు అనుమతి లభించినట్లు తెలుస్తోంది. ఒక కళాశాలలో చదవాలని అనుకుంటే అందులోనే రెండు, మూడు కోర్సులను ఐచ్చికాలుగా నమోదు చేయడం తెలిసిందే.. అలాంటప్పుడు ఏ కోర్సులో ఎన్ని సీట్లు ఉన్నాయనే విషయం కీలకం.. జిల్లాలోని కళాశాలల్లో లభించే కోర్సులు, ఇన్‌టేక్(సీట్ల)పై స్పష్టత అవసరం.. కళాశాల వారీగా సీట్ల వివరాలను జేఎన్‌టీయూహెచ్ అంతర్జాలంలో పెట్టలేదు.. కేవలం సంబంధిత కళాశాల యాజమాన్యాలకు మెయిల్ ద్వారా సమాచారం అందించింది.. వెబ్ ఆప్షన్ల సమయం సవిూపిస్తుంటే కళాశాల వారీగా కోర్సులు, సీట్ల వివరాలు తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. అప్పుడే వెబ్ ఆప్షన్లను సులభంగా ఇచ్చుకునే అవకాశం ఉంటుంది. గతేడాది సీట్ల లభ్యత ఆధారంగా ఏ ర్యాంకు వస్తే ఎక్కడ సీటు వస్తుందనే విషయంపై అవగాహనకు వచ్చే అవకాశం ఉంటుంది.
—-
ఎంసెట్ కౌన్సిలింగ్‌కు సిద్దం అవుతున్న అధికారులు




