Tuesday, 3 November 2026

ఎక్స్‌ అఫీషియో ఓట్లపై హైకోర్టులో కొనసాగుతున్న విచారణ

h6ueg6fqహైదరాబాద్ : గ్రేటర్‌ మేయర్ ఎన్నికల్లో ఎక్స్ అఫీషియో ఓట్లపై హైకోర్టులో ఇవాళ కూడా విచారణ జరుగుతోంది. ఎమ్మెల్సీలను ఎక్స్‌ అఫీషియో సభ్యులుగా చేర్చుతూ టీ సర్కార్‌ చేసిన చట్టసవరణను హైకోర్టు విచారిస్తోంది. బుధవారం దీనిపై విచారణ జరిగింది. చట్ట సవరణపై ఉన్నత న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు సిద్ధపడింది. తెలంగాణ అడ్వకేట్‌ జనరల్‌ ఒక రోజు గడువు కోరడంతో నేటికి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో హైకోర్టు విచారణపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *