Monday, 2 November 2026

ఎగ్జిబిషన్‌ సొసైటీ లీజు రద్దుకాదన్న ఈటెల

హైదరాబాద్‌,ఆగస్ట్‌30 : ఎగ్జిబిషన్‌ సొసైటీ లీజు రద్దు చేశారంటూ గిట్టనివారు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని మంత్రి ఈటల సూచించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు సీఎం కేసీఆర్‌ పెద్దపీట వేస్తున్నారని మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడేందుకు సీఎం కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రజల ఆదరణ చూరగొన్న సంస్థలు, వ్యక్తులకు సీఎం కేసీఆర్‌ అండగా నిలుస్తున్నారనిఅన్నారు. అందులో భాగంగానే నుమాయిష్‌కు సీఎం కేసీఆర్‌ మద్దతు తెలిపారని ఈటల పేర్కొన్నారు. ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌కు ఇచ్చి భూమి లీజును రద్దు చేస్తూ సిఎం తీసుకున్న నిర్ణయంపై మంత్రి ఈటల మాట్లాడుతూ ఉస్మానియా గ్రాడ్యుయేట్స్‌ 78 ఏళ్ల క్రితం ఎగ్జిబిషన్‌ సొసైటీ ఏర్పాటు చేశారని, ప్రతీ ఏడాది నాంపల్లిలో నిర్వహిస్తున్న ఎగ్జిబిషన్‌కు ప్రజలు పెద్ద ఎత్తున హాజరవుతున్నారని మంత్రి ఈటల వెల్లడించారు. ఎగ్జిబిషన్‌ సొసైటీ 18 విద్యాసంస్థలను కూడా నిర్వహిస్తోందన్నారు. తెలంగాణ వచ్చినంక మొదటి సంవత్సరం నుమాయిష్‌ను సీఎం ప్రారంభించారు. 99 సంవత్సరాలు భూమిని లీజుకు ఇస్తామని సీఎం ప్రకటించారు. సీఎం కేసీఆర్‌ ప్రజామోదం ఉన్న సంస్థలను పెంచేందుకు ప్రయత్నం చేస్తరని స్పష్టం చేశారు.