విశాఖ, (జనంసాక్షి): రాష్ట్రవ్యాప్తంగా ఈ రోజు జరగనున్న ఎడ్‌సెట్ పరీక్షకు ‘ద్వారకామయి’ కోడ్‌ను అధికారులు సోమవారం విడుదల చేశారు. ఎడ్‌సెట్ కోసం రాష్ట్రంలో 42 నగరాల్లో 287 సెంటర్లు ఏర్పాటు చేశారు. లక్షా 47 వేల 865 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారు. ఉదయం 11 గంటల నుంచి పరీక్ష జరగనుంది.




