Tuesday, 3 November 2026

జార్ఖండ్‌లో ఎన్‌కౌంటర్..ముగ్గురు నక్సల్స్ మృతి

jharkhand-map

రాంఛీ: జార్ఖండ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు నక్సలైట్లు మృతి చెందారు. ఇవాళ జార్ఖండ్‌లోని హజారీబాగ్ జిల్లాలో భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందినట్టు పోలీసులు వెల్లడించారు. బుకార్ గ్రామంలోని అటవీ ప్రాంతంలో పారామిలటరీ దళాలు జరిపిన ప్రత్యేక ఆపరేషన్‌లో భాగంగా వీరిని హతమార్చాయి. ఎన్‌కౌంటర్ అనంతరం నక్సల్స్ మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్టు సీనియర్ భద్రతాధికారి వెల్లడించారు. ఎన్‌కౌంటర్ తర్వాత నక్సల్స్ మృతదేహాలను స్వాధీనం చేసుకోవడం చాలా అరుదుగా జరుగుతుందని ఆయన తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *