ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
గుంటూరు,ఆగస్ట్8(జనం సాక్షి): కాటూరి మెడికల్ కాలేజి హాస్పటల్‌లో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పుల్లారావు మాట్లాడుతూ.. రైతులు, హమాలీలు, వర్కర్లకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం ఎంతో ఆదర్శనీయమన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ వైద్య సేవల్లో అర్హత కలిగిన వ్యాధులకు చికిత్స అందిస్తారని తెలిపారు. ప్రత్యేకమైన వ్యాధులకు సంబంధించి ముఖ్యమంత్రి సహాయనిధికి రిఫర్ చేసి చికిత్స అందిస్తామని పేర్కొన్నారు.