Wednesday, 4 November 2026

కరవు నివారణ చర్యలు తీసుకోవాలి

కడప,ఆగస్ట్‌8(జ‌నం సాక్షి): ఎపి రైతు సంఘం ఆధ్వర్యంలో బుధవారం రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రికి వినతిపత్రం అందజేశారు. శాశ్వత కరువు నివారణ చర్యలు చేపట్టాలని కోరుతూ ఎపి రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు నారాయణ, జిల్లా ఇన్చార్జి మంత్రి రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి కి వినతిపత్రం సమర్పించారు.