Tuesday, 3 November 2026

ఎన్నికల నియమావలిని అభ్యర్థులు పాటించాలి

ఆదిలాబాద్‌, జనవరి 29 ():  శాసన మండలి ఎన్నికల్లో అభ్యర్థులందరూ నియమ నిబంధనలను  కచ్చితంగా పాటించాలని జిల్లా కలెక్టర్‌ అశోక్‌ పేర్కొన్నారు. జిల్లాలో జరగనున్న శాసన మండలి ఎన్నికల్లో  పట్టభద్రుల కోసం 65 పోలీంగ్‌ కేంద్రాలు, ఉపాధ్యాయుల కోసం 55 పోలీంగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ప్రతి వెయ్యి మంది ఓటర్లకు ఒక పోలీంగ్‌ కేంద్రం కేటాయించినట్లు ఆయన తెలిపారు. శాసన మండలి ఎన్నికలకు సంబంధించి ఎన్నికల నోటీఫికేషన్‌ జారీ అయినందున అన్ని పార్టీల నాయకులు కమిషన్‌ సూచించిన నిబంధనలను పాటించాలని కోరారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్‌ డిపాజిట్‌ కింద రెండు జనరల్‌ అభ్యర్థులు ఒక్కొక్కరు రూ. 10వేలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ. 5వేలు చెల్లించాలన్నారు. రాజకీయ నాయకులు తమ సమీప అభ్యర్థులు వ్యక్తిగత జీవితాలపై ఎలాంటి విమర్శలు చేయరాదని కుల, మతపరమైన భావాలతో ప్రచారం చేయవద్దని కలెక్టర్‌ సూచించారు. పోలింగ్‌కు 48గంటల ముందు బహిరంగ సభలు నిర్వహించరాదని ఎన్నికల నిబంధనలను ధిక్కరించే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *