Tuesday, 3 November 2026

ఎన్నికల పోలింగ్‌ కేంద్రాల గుర్తింపు

 

21 వార్డుల వారీగా కేంద్రాల వెల్లడి

హైదరాబాద్‌,నవంబర్‌17(జ‌నంసాక్షి): గ్రేటర్‌లో పోలింగ్‌ కేంద్రాల గుర్తింపు పూర్తయ్యింది. కొవిడ్‌ నేపథ్యంలో పోలింగ్‌ కేంద్రాల సంఖ్య పెరిగింది. ఇకపోతే బ్యాలట్‌ పత్రాల ద్వారానే ఎన్నికలు నిర్వహించబోతున్నారు. బీహార్‌, దుబ్బాకలో అనుసరించిన ఎన్నికల వ్యూహం మేరకు ఇసి అధ్యయనం చేస్తోంది. కరోనా నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకుని ముందుకు సాగనున్నారు. 2016 ఎన్నికల్లో 6,900 పోలింగ్‌ కేంద్రాలుండగా, ఈసారి 9,248 కేంద్రాలను గుర్తిస్తూ, ముసాయిదా జాబితాను జీహెచ్‌ఎంసీ ప్రకటించింది. గతంలో 1,400 మంది ఓటర్లకు ఒక పోలింగ్‌ కేంద్రం ఉండగా, కొవిడ్‌ నేపథ్యంలో వెయ్యి మందికో పోలింగ్‌ కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు. ముసాయిదాపై అభ్యంతరాలు, ఫిర్యాదులు, సలహాలు స్వీకరించనున్నారు. 18న అభ్యంతరాలు, ఫిర్యాదుల పరిశీలన పూర్తి చేస్తారు. 19న తుది జాబితాను ఎన్నికల అధికారికి పంపుతారు. 21న వార్డుల వారీగా తుది జాబితా వెలువడుతుంది. దాదాపు 70 వేల మంది ఓటర్లున్న కొండాపూర్‌ వార్డులో అత్యధికంగా 99, 27 వేల పైచిలుకు ఓటర్లు మాత్రమే ఉన్న ఆర్‌సీపురంలో 33 పోలింగ్‌ కేంద్రాలున్నాయి. కాప్రా-312 ఫ ఉప్పల్‌-203 ఫ హయత్‌నగర్‌-290 ఎల్‌బీనగర్‌-218 ఫ సరూర్‌నగర్‌-338 మలక్‌పేట- 443 సంతో?షనగర్‌-383 ఫ చాంద్రాయణగుట్ట-371 ఫ చార్మినార్‌-291 ఫలక్‌నుమా-291 రాజేంద్రనగర్‌-316 మెహిదీపట్నం-429 కార్వాన్‌-342 గోషామహల్‌-329 ముషీరాబాద్‌- 430 అంబర్‌పేట-370 ఖైరతాబాద్‌-254 జూబ్లీహిల్స్‌-267 యూసు?ఫగూడ-330 శేరిలింగంపల్లి-265 చందానగర్‌-350 ఆర్‌సీపురం, పటాన్‌చెరు-120 మూసాపేట-361 కూకట్‌పల్లి- 465 కుత్బుల్లాపుర్‌-245 గాజుల రామారం-203 అల్వాల్‌-160 మల్కాజ్‌గిరి-319 సికింద్రాబాద్‌-289 బేగంపేట-256