Tuesday, 3 November 2026

టిఆర్‌ఎస్‌ మరోమారు విజయం సాధిస్తుంది: ముఠాగోపాల్‌

హైదరాబాద్‌,నవంబర్‌17(జ‌నంసాక్షి): టీఆర్‌ఎస్‌ అంటే ప్రజలకు విశ్వాసం ఉందని.. గ్రేటర్‌ ఫలితాల్లో అది మరోసారి నిరూపితమవుతుందని ముషీరాబాద్‌ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ అన్నారు. గ్రేటర్‌ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ సత్తా చాటుతుందన్నారు. వరద సాయంపై విపక్షాలది రాజకీయమని మడిపడ్డారు. అమెజాన్‌ రూ.20 వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టడంలో మంత్రి కేటీఆర్‌ కీలక పాత్ర పోషించారన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడిన వారంతా ప్రస్తుతం సంతోషంగా ఉన్నారంటే అందుకు సీఎం కేసీఆర్‌ పాలనే కారణమన్నారు. కచ్చితంగా 100కు పైగా సీట్లు వస్తాయన్నారు. ప్రతిపక్షాలకు అభ్యర్థులే దొరకడం లేదన్నారు.