Wednesday, 4 November 2026

ఎన్నికల ప్రచారంపై డేగకన్ను

నిఘా పెంచిన అధికారులు

ఎక్కడికక్కడ ఖర్చుపై ఆరా

మద్యం,డబ్బు, ప్రవాహంపై నిశిత పరిశీలన

హైదరాబాద్‌,నవంబర్‌5(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ మహాకూటమి అభ్యర్థల జాబితా ఇంకా వెల్లడి కావాల్సి ఉండగా టిఆర్‌ఎస్‌ ప్రచారంలో దూసుకుని పోతోంది. ముందస్తు ఎన్నికల ప్రచారం వాడీవేడీగా సాగుతుండగా ఎన్నికల సంఘం నిఘాను పెంచింది. అభ్యర్థుల ఖర్చు,ప్రచార తీరు, మద్యం సరఫరా తదితరాలపై డేగకన్ను వేసింది. ఎన్నికల సంఘం ప్రచార సరళిని జాగ్రత్తగా గమనిస్తోంది. అలాగే అబ్యర్థుల హంగూ ఆర్భాటాలపై ఆరా తీస్తున్నది. ప్రధానంగా మద్యం,డబ్బు పంపిణృపై దృష్టి సారించింది. ఎన్నికల నియమ, నిబంధనలు సంబంధించిన అంశాలపై అభ్యర్థులతో పాటు రాజకీయ పార్టీలకు, ప్రజలకు పూర్తి చైతన్యాన్ని కల్పించారు. అలాగే విూడియా పాత్రపైనా నిబంధనలు గుర్తు చేస్తున్నారు. విూడియా ఎన్నికలకు సంబంధించిన వార్తలు, పెయిడ్‌న్యూస్‌, అడ్వర్‌టైజ్‌మెంట్‌ల విషయంలో వచ్చిన ఫిర్యాదులపై నిశితంగా పరిశీలిస్తున్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యవహరించాలని ఆదేశించారు. అలాగే జిల్లాల్లో పోలింగ్‌ నిర్వహణకు అవసరమైన ఈవీఎంలు, వీవీ ప్యాట్‌లు జిల్లా కేంద్రాలకు చేరుకోగా వాటిని

భద్రపర్చారు. ప్రింటింగ్‌ ప్రెస్‌లు, ప్రింట్‌ అండ్‌ ఎలక్టాన్రిక్‌ విూడియా, స్థానిక ఛానల్స్‌, యాడ్‌ సర్టిఫికేషన్‌ పొందాలని సూచించారు. మరోవైపు ఎన్నికల పక్రియలో పాల్గొనే సిబ్బందికి దశల వారీగా శిక్షణలు ఇచ్చి శిక్షణా కార్యక్రమాలను పూర్తిస్థాయిలో చేపట్టారు. నియోజకవర్గాల ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులను నియమించారు. ఎన్నికల కవిూషన్‌ ఆదేశాల మేరకు నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాల్లో పోలీస్‌ ఫ్లెయింగ్‌ స్కాడ్‌లను ఏర్పాటు చేసింది. వీడియో కెమేరాల నిఘా మధ్య నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాల్లో ఎన్నికల పక్రియ నిర్వహించబోతున్నారు. అనుమతి లేకుండా ఎలాంటి ప్రచార కార్యక్రమాలు, పోస్టర్లు, ఫ్లెక్సీలు, ఇతర సాధనాలను ఉపయోగిస్తే వాటిని ఖచ్చితంగా తొలగిస్తున్నారు. ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో జిల్లా అధికారులు ఇసి ఆదేశాల మేరకు నడుచు కుంటున్నారు. ప్రవర్తన నియమావళిపై దృష్టి సారించారు. ఎన్నికల విధులను ఇప్పటికే అధికారులకు కేటాయించారు. ఆయా పార్టీల అభ్యర్థుల ప్రచార సరళిపై దృష్టి సారించారు. గ్రామాలు, పట్టణాల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, గోడరాతలు, బ్యానర్లను తొలగిస్తున్నారు. ఇప్పటికే ఈ పనులు ముమ్మరంగా కొనసాగి స్తున్నారు.వివిధ రకాల ప్రచారాలకు సంబంధించి బోర్డులను తొలగిస్తూ గోడరాతలను చెరిపేస్తున్నారు. ఇప్పటికే ¬ర్డింగ్‌లు, బ్యానర్లు తొలగించారు. రెవెన్యూ, పోలీసు, ఇతర శాఖల అధికారులు సంయుక్తంగా ఈ పనుల్లో నిమగ్నమయ్యారు. నిబంధనలు ఉల్లంఘిస్తే

శాఖాపరమైన చర్యలు ఉంటాయని రాజకీయ పార్టీల నాయకులకు హెచ్చరిస్తున్నారు. సభలు, సమావేశాలు, ర్యాలీలు ఏ ఇతర కార్యక్రమాలు రాజకీయ పార్టీలు చేపట్టినా ముందస్తు అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని సూచించారు. గ్రామాలకు వెళ్లే వాహనాలకు, బైక్‌ల వినియోగం కోసం ముందస్తు అనుమతులు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం ఆదేశాలను కలెక్టర్లు అమలు చేస్తున్నారు. దీంతో గ్రామాల్లో కూడా పరిశీలకులు నిఘా పెంచారు. పరిశీలకులు ప్రతి చిన్న విషయాన్ని ఇసికి నివేదిస్తున్నారు.