Wednesday, 4 November 2026

తెలంగాణలో చురకుగా ఎన్నికల ప్రక్రియ

అధికారుల బిజీతో పక్కన పడ్డ ఇతర పనులు

ఓటర్ల నమోదుకు 9వరకు అవకాశం

గ్రామాల్లో పోలింగ్‌ పెంచేలా చైతన్య కార్యక్రమాలు

హైదరాబాద్‌,నవంబర్‌5(జ‌నంసాక్షి): తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం తనపని తాను చేసుకుంటూ పోతోంది. అధికారులు బిజీగా గడుపుతన్నారు. ఓటర్ల నమోదు, పోలింగ్‌ బూతుల ఏర్పాటు, అధికారులకు విదుల అప్పగింత తదితర కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. ఇక పోలీసులు, నిఘా సంస్థలు అక్రమ డబ్బురవాణాపై దృష్టి పెట్టారు. 2018 జనవరి 1వ తేదీ నాటికి విూ వయస్సు 18 ఏండ్లు నిండిన వారిని ఓటరుగా నమోడు చేయించుకునే ప్రక్రియ చురకుగా సాగుతోంది. 9 వరకు ఈ అవకాశం ఉంది. ఇప్పటికీ ఓటరుగా నమోదు చేయించుకోలేని వారు వెంటనే సవిూపంలోని వార్డు కార్యాలయంలో లేదా, గ్రామ పంచాయితీలో లేదా బూత్‌లెవల్‌ ఆఫీసర్‌ వద్ద ఫారం-6ని తీసుకొని వెంటనే ఓటరుగా నమోదు చేయించుకోవాలని అధికారులు సూచించారు. ఎన్నికల కమిషన్‌ నిబంధనల ప్రకారం రాష్ట్రంలో 2018 డిసెంబర్‌ 7వ తేదీన జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయాలంటే ఈ నెల 9వ తేదీలోపు ఓటరుగా నమోదై ఉండాలి. మరో నాలుగు రోజులు మాత్రమే గడువు ఉన్న నేపథ్యంలో 18 ఏండ్లు నిండిన ప్రతి పౌరుడు నమోదు కావడంతో పాటు డిసెంబర్‌ 7న జరిగే ఓటింగ్‌లో పాల్గొనాలని ఎన్నికల అధికారులు చర్యలను విస్తృతం చేశారు. కార్డు ఉన్నప్పటికీ తుది జాబితాలో ఓటులేని వ్యక్తులు కూడా ఫారం-6 ద్వారా

తమ పేర్లను నమోదు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

ఎన్నికల పనులకే పరిమితమైన సిబ్బంది

జిల్లాల్లో అధికారులు బిజీగా ఉన్నారు. ఇతర కార్యక్రమాలకన్నా ఎన్నికల పనులకే అధికా ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో జిల్లాలో ఇతరత్రా పనలుకు వచ్చేవారు తగ్గారు. కార్యాలయ సిబ్బందిని ఎన్నికల విధులకు కేటాయించడంతో వారు ఆయా పనుల్లో ఉన్నారు. ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో రెవెన్యూ అధికారులు, ఇతర శాఖల అధికారులు బిజీబిజీ అయ్యారు. ఆయా శాఖలతో పాటు పోలీసులు ఎన్నికల విధులు కేటాయించిన పనుల్లో నిమగ్నమయ్యారు. గత నెల నుంచి ఓటరు నమోదు, ఈవీఎం, వీవీప్యాట్లపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఓటరు నమోదు శాతం పెంచేందుకు గ్రామాలు, పట్టణాల్లో మాక్‌పోలింగ్‌ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గతంలో ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహించగా.. అప్పట్లో సందిగ్ధం నెలకొందని, ఓటర్ల సందేహాలను నివృత్తి చేసేందుకు అధికారులు మాక్‌ పోలింగ్‌ నిర్వహిస్తున్నారు. ఓటు వేసిన 7 సెకండ్లలో ఓటరు వేసిన గుర్తుకు ఓటు పడిందా లేదా అనేది వీవీప్యాట్‌ మిషన్‌ ద్వారా రసీదు వస్తుంది. దాని ద్వారా ఓటరు తెలుసుకొనే వెసులు బాటును కల్పించారు. ప్రజలకు ఎలక్టాన్రిక్‌ ఓటింగ్‌ యంత్రాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

జిల్లాల్లో ఓటర్లకు అవగాహన

అందుబాటులోకి వచ్చిన నూతన సాంకేతిక పరిజ్ఞానంతో ఈవీఎం యంత్రాలను ప్రవేశ పెట్టారు. వీవీ ప్యాట్‌ త్రాలను వచ్చే ఎన్నికల్లో మొదటిసారి ప్రవేశ పెడుతున్నారు. వీటి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. జిల్లాల్లో మాక్‌ పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసి మరీ ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నారు. వీటి ద్వారా ఎన్నికల నిర్వహణ, లెక్కింపు సులభతరమైంది. చెల్లని ఓట్ల సంఖ్య తగ్గిపోయింది. అయితే ఓటమి పాలైన పార్టీలు ఈ యంత్రాల ద్వారా ఓట్ల ట్యాంపరింగ్‌ జరిగిందని ఎన్నికల సంఘాన్ని నిందించడం మొదలు పెట్టాయి. దీంతో పూర్తి పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం మరో కొత్త విధానాన్ని ముందుకు తెచ్చింది. మరింత అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిం చుకుని ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. ఎన్నికలు పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించే అవకాశం ఏర్పడింది. ఎన్నికల నిర్వహణలో ఎప్పటికపుడు మార్పులు వస్తున్నాయి. భారత ఎన్నికల సంఘం ఈవీఎంల రూపంలో ఇప్పటికే కొన్ని సంస్కరణలు తెచ్చింది. బ్యాలెట్‌ పత్రాల ద్వారా ఎన్నికలు నిర్వహించడం వల్ల అనేక సమస్యలు తలెత్తేవి. కొన్ని పార్టీలు, అభ్యర్థుల అనుచరులు రిగ్గింగులకు పాల్పడడం, బ్యాలెట్‌ బాక్సుల్లో నీళ్లు పోయడం వంటి ఘటనలు జరిగి ఒకే చోట మళ్లీ మళ్లీ ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి ఉండేది. దీంతో ఓటర్లు స్వేచ్ఛగా పొలింగ్‌ కేంద్రాలకు వచ్చే పరిస్థితి ఉండేది కాదు. దీంతో పోలింగ్‌ కేంద్రాలకూ జియో ట్యాగింగ్‌ చేపట్టారు. వీటిని స్మార్ట్‌ ఫోన్ల సహాయంతో జియో ట్యాగింగ్‌ చేస్తున్నారు. పోలింగ్‌ కేంద్రాలకు ప్రత్యేక యాప్‌ ద్వారా ఫొటోలు తీసి జియో ట్యాగింగ్‌ చేస్తున్నారు. అదే విధంగా ఈవీఎం యంత్రాలపై ఉన్న బార్‌కోడ్‌ను స్కాన్‌ చేసి వాటి వివరాలను కంప్యూటర్లలో నిక్షిప్తం చేస్తున్నారు. ఇప్పటికే అధికారులు ఈ నమూనాలపై శిక్షణ కూడా పూర్తి చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఈ విధానం మరింత ఉపయోగకరంగా ఉం టుంది. ఎవరైనా ఈవీఎం యంత్రాలను ఎత్తుకెళ్లినా అవి ఎక్కడ ఉన్నాయో వెంటనే తెలుసుకుని చర్యలు తీసుకునే అవకాశం ఏర్పడుతుంది. ఓట్ల లెక్కింపులోనూ ఈ విధానం సహకరిస్తుంది. లెక్కింపులో తేడాలు వచ్చినా, ఈ రశీదులను పరిగణలోకి తీసుకుంటారు. రశీదులు ప్రత్యేక

ఇంక్‌తో ముద్రిస్తున్న నేపథ్యంలో ఐదేళ్ల వరకు చెక్కు చెదరకుండా ఉంటాయి. ఎన్నిక విషయంలో కోర్టు జోక్యం చేసుకున్నా, మరే ఇతర కారణాలతో ఎన్నిక వివాదాస్పదమైనా వీవీ ప్యాట్స్‌ రశీదులను పరిగణలోకి తీసుకుంటారు. ఈ విధానం పూర్తిగా పారదర్శకంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు.