హైదరాబాద్,నవంబర్5(జనంసాక్షి): ఎన్నికలకు భద్రతను కట్టుదిట్టం చేస్తున్నామని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. మద్యం, నగదు తరలింపుపై ప్రత్యేక దృష్టి పెట్టామని, ఇప్పటి వరకు 4049 మంది ఆయుధాలు సరెండర్ చేశారని సీపీ వెల్లడించారు. వివిధ కేసుల్లో ఉన్న 1793 మందికి న్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేశామని, 20,958 మంది రౌడీ షీటర్లను బైండోవర్ చేశామని తెలిపారు. 1616 బాటిళ్ల మద్యం సీజ్ చేశామని, రూ. 76 లక్షలు స్వాధీనం చేసుకున్నామని అంజనీకుమార్ పేర్కొన్నారు.




