Monday, 2 November 2026

ఎపిలో అన్నిసీట్లకు పోటీ చేస్తాం: రఘువీరా

ఏలూరు,అక్టోబర్‌31(జ‌నంసాక్షి): ఏపీలో పొత్తుపై అధిష్టానమే నిర్ణయిస్తుందని ఏపీసీసీ చీఫ్‌ రఘువీరారెడ్డి స్పష్టం చేశారు. అన్ని స్థానాల్లో పోటీకి సిద్ధంగా ఉండాలని హైకమాండ్‌ చెప్పిందని తెలిపారు. ఏపీలో 72 శాతం మంది ప్రజలు రాహుల్‌ని ప్రధానిగా కోరుకుంటున్నారన్నారు. పప్పు అన్న రాహుల్‌ ఇప్పుడు నిప్పు అయ్యారని ఆయన పేర్కొన్నారు. ఏపీలో రాబోయే 20 రోజుల్లో రాహుల్‌ పర్యటిస్తారని తెలిపారు. చిరంజీవి

కాంగ్రెస్‌తోనే ఉంటారని…ఎన్నికలకు 2 నెలల ముందు ప్రచారానికి వస్తానని రాహుల్‌కి చిరంజీవి చెప్పారని తెలిపారు. జగన్‌పై దాడి కేసులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం ఉందని విమర్శించారు. దాడి ఘటనను టీడీపీ, వైసీపీ, బీజేపీ రాజకీయం చేస్తున్నాయని రఘువీరా మండిపడ్డారు.