ఎపి ఉద్యోగులకు తీపి కబురు
పిఆర్సీ బకాయిల కింది269 కోట్లు విడుదల
అమరావతి,జూన్8(జనం సాక్షి): ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు ప్రభుత్వం తీపికబురందించింది. ఉద్యోగుల పీఆర్సీ బకాయిల కింద తక్షణం రూ.269 కోట్లు విడుదల చేసింది. మిగిలిన మొత్తం పీఎఫ్ ఖాతాల్లో జమ చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. రూ.1710 కోట్ల బకాయిలు మూడు కేటగిరీలుగా ప్రభుత్వం చెల్లించనుంది. అలాగే పెన్షనర్లకు 100 శాతం చెల్లింపులకు రూ. 715 కోట్లు విడుదల చేసింది. దీని వల్లప్రభుత్వంపై అదనంగా రూ.3,919 కోట్ల భారం పడుతుంది. కేంద్రం నుంచి నిధులు రాకపోయినా రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్నాయి.