విజయవాడ,మే21(జనం సాక్షి): ఏపీఎక్స్‌ప్రెస్ అగ్నిప్రమాదంపై రైల్వే అధికారులు ఆయా స్టేషన్లలో హెల్ప్‌లైన్ నంబర్లు ఏర్పాటుచేశారు. విజయవాడలో హెల్పైలైన్ నెంబర్: 0866 2574163, గ్వాలియర్‌లో హెల్ప్‌లైన్ నెం. 0751 2432799, 2432849, విశాఖ రైల్వే స్టేషన్‌లో హెల్ప్‌లైన్ నెం: 0891 2883003, 2883004, 2746330, 2746344. విజయవాడ డివిజన్ విూదుగా వెళ్లే రైళ్లలో ఏసీ కోచ్‌ల తనిఖీ కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామని, కోచ్‌లు ఆటో లాక్ కావడంతో ప్రమాద తీవ్రత పెరిగిందని రైల్వేశాఖ అధికారులు తెలిపారు. ప్రమాదం నేపథ్యంలో రైలులో ప్రయాణిస్తున్న ప్రయాణికులతో ఆర్టీజీఎస్ అధికారులు మాట్లాడారు. బి6, బి7 కోచ్‌లో ఉన్న 65 మంది విశాఖ వాసులు సురక్షితం అని తెలిసింది.




