ఎమ్మెల్యే బీరం ఆదేశాల మేరకు రాజాపూర్ గ్రామంలో బిసి బోయ కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులు ప్రారంభం.
కోడేరు జనం సాక్షి నవంబర్ 2 కోడేరు మండల పరిధిలోని రాజాపూర్ గ్రామంలో వాల్మీకి బోయ బీసీ కమ్యూనిటీ హాల్ పనులు ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి సహకారంతో బుధవారం రోజు గ్రామ సర్పంచ్ దేశగౌని లీలావతి మధు గౌడ్ గ్రామ ఉపసర్పంచ్ కేశం బాలకిష్టయ్య పనులు ప్రారంభించారు. కోడేరు మండలం రాజాపూర్ గ్రామ పరిధి లో బుధవారం రోజు వాల్మీకి బోయ వారికి బిసి కమ్యూనిటీ హాల్ గ్రామ సర్పంచి దేశ గౌని లీలావతి మధుసూదన్ గౌడ్ ఉప సర్పంచ్ బాల క్రిష్టయ్య ఆధ్వర్యంలో ముగ్గు పోసి పిల్లర్ గుంతలు తీయడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు మబ్బు బాలక రాముడు. మద్దిలేటి. మహేష్. ఉప్పుటూరి చంద్రయ్య, కావలి చిన్నయ్య, రాములు, రామస్వామి, బాలస్వామి, గ్రామ ప్రజలు తదీతరులు పాల్గొన్నారు.