ఎమ్మెల్యే ముత్తిరెడ్డి పర్యటన కాంగ్రెస్ సర్పంచ్ అరెస్టు..
జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి చేర్యాల మండలంలోని చుంచనకోట గ్రామ పర్యటన నేపథ్యంలో బుధవారం స్థానిక గ్రామ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఆది శ్రీనివాస్, ఉప సర్పంచ్ గుడ్ల బాబుతో పాటు చేర్యాల మండల కాంగ్రెస్ సోషల్ మీడియా కన్వినర్ సుతారి రమేష్ లను ముందస్తుగా అరెస్టు చేసి చేర్యాల పోలీసు స్టేషన్ కు తరలించారు. ఈసందర్భంగా ఆది శ్రీనివాస్ విలేకరులతో మాట్లాడుతూ.. గ్రామ సర్పంచ్ అని చూడకుండా ఒక జాతీయ పార్టీకి అధ్యక్షుడని గౌరవించకుండా అధికార పార్టీ జులుంతో ముందస్తు అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసమని మండిపడ్డారు. గ్రామ ప్రజాప్రతినిధులను అరెస్టు చేసి గ్రామంలో పర్యటించడం అప్రజాస్వామికమని ఎమ్మెల్యే తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని టీఆర్ఎస్ పార్టీని భవిష్యత్తులో చిత్తుగా ఒడిస్తామని వారు హెచ్చరించారు.