Tuesday, 3 November 2026

ఎయిర్‌పోర్టులో హైదరాబాద్‌ ఇంజనీర్‌ అరెస్ట్‌

3
ఐఎస్‌ఐఎస్‌తో సంబంధాలున్నాయి-పోలీసులు

నా కొడుకు అమాయకుడు

జేఎన్‌టీయూలో ఇంజనీరింగ్‌, లండన్‌లో ఎంఎస్‌ చదివాడు

ఉద్యోగం కోసమే దుబయ్‌ వెళ్లాడు-మొయినుద్దీన్‌ తండ్రి

హైదరాబాద్‌,జనవరి 16, (జనంసాక్షి): శంషాబాద్‌ విమానాశ్రయంలో ఐఎస్‌ఐఎస్‌లో చేరేందుకు వెళ్తున్న మెయినుద్దీన్‌ అనే యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌ బజార్‌ ఘాట్‌కు చెందిన అతడు గత కొంతకాలంగా ఉగ్రవాదులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ నేపథ్యంలో దుబాయ్‌ వెళ్లి ఐఎస్‌ఐఎస్‌లో చేరేందుకు వెళ్తున్నట్లు పోలీసులు గుర్తించి పట్టుకున్నారు. దుబాయి వెళ్లి అక్కడి నుంచి టర్కీ మీదుగా సిరియా వెళ్లేందుకు ప్రణాళిక చేసుకున్నాడు. ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన మొయినుద్దీన్‌ అమెరికాలోని సదరన్‌ యూనివర్శిటీ టెక్సాస్‌, అండ్‌ డబ్ల్యూఎస్‌లో ఎంఎస్‌ చదివాడు. నాలుగేళ్లుగా టెక్సాస్‌లో ఉంటున్న అతడు ఇటీవలే హైదరాబాద్‌కు వచ్చాడు. సల్మాన్‌ను సైబరాబాద్‌ పోలీసులు, కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ ఐబీ బృందాలు ప్రశ్నిస్తున్నాయి.

మరోవైపు తన కుమారుడు నిజాయితీపరుడని ఎలాంటి తప్పు చేయలేదని సల్మాన్‌ మొయినుద్దీన్‌ తండ్రి అన్నారు. శంషాబాద్‌ విమానాశ్రయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్‌ జేఎన్‌ టీయూలో బీటెక్‌ పూర్తిచేసి లండన్‌ లో ఎమ్మెస్‌ చేశాడని తెలిపారు. దుబాయ్‌ లో ఉద్యోగం కోసం వెళుతున్న తన కుమారుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారని వాపోయారు. సల్మాన్‌ కు ఏడేళ్ల క్రితం వివాహం అయిందని పాప, బాబు ఉన్నారని తెలిపారు. ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్‌ స్టేట్‌తో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో హైదరాబాద్‌ కు చెందిన సల్మాన్‌ మొయినుద్దీన్‌ ను

తెలంగాణ పోలీసులు శంషాబాద్‌ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. అతడు అమెరికాలో ఇస్లామిక్‌ స్టేట్‌ శిక్షణ పొందినట్లు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *