Tuesday, 3 November 2026

ఎర్రవల్లిలో నాలుగోరోజు యాగం ప్రారంభం

2zankneyమెదక్ : లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తలపెట్టిన అయుత మహాచండీయాగం నాలుగో రోజు శనివారం అత్యంత వైభవంగా ఆరంభమైంది. మెదక్ జిల్లా జగదేవ్పూర్ మండలం ఎర్రవల్లిలో ఉదయం ఎనిమిది గంటలకు ఈ యాగం ప్రారంభమైంది. యాగంలో భాగంగా ఈ రోజు మృత్యుంజయ హోమం, కుమారి సూహాసిని పూజ, కోటి సహస్రనామాలను రుత్వికులు నిర్వహిస్తున్నారు.

కేసీఆర్ దంపతులు ఎరుపు రంగు వస్త్రాలు ధరించి యాగశాలకు చేరుకున్నారు. ఈ రోజు యాగానికి తమిళనాడు గవర్నర్ కె.రోశయ్య హాజరయ్యారు. అలాగే ఎన్సీపీ నేత శరద్ పవర్తో పాటు సుప్రీంకోర్టు నాయమూర్తి ఎన్వీ రమణ కూడా ఈ యాగ స్థలికి విచ్చేశారు.

అయితే ఉదయం నుంచే ఎర్రవల్లికి భక్తులు పోటెత్తారు. ఈ నేపథ్యంలో 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. భక్తుల రద్దీ పెరగడంతో యాగశాల వద్ద మరో రెండు అదనపు క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ఈ యాగం ఆదివారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో చివరి రెండు రోజులు అంటే ఇవాళ, రేపు భక్తులు భారీ సంఖ్యలో ఎర్రవల్లికి తరలి వచ్చే అవకాశం ఉంది.

కిక్కిరిసిన ఎర్రవల్లి దారులు

అయుత చండీ మహాయాగానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. భక్తుల సంఖ్య అధికమవడంతో కుంకుమార్చన కార్యక్రమాన్ని రద్దు చేయడం జరిగింది. చివరి రెండు రోజులు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మరో రెండు క్యూలైన్లను ఏర్పాటు చేశారు. ఇక ఎర్రవల్లిలో మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. భక్తుల రద్దీని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇక ఎర్రవల్లికి వచ్చే దారులన్నీ కిక్కిరిసిపోయాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *