విశాఖపట్టణం,నవంబర్3(జనంసాక్షి): అవినీతి నిరోధక శాఖ అధికారుల వలకు విశాఖ రవాణా శాఖ ఎంవీఐ చిక్కారు. రవాణ శాఖ ఎంవీఐగా పనిచేస్తున్న ఎస్. వెంకట్రావ్ ఇంట్లో అనిశా అధికారులు శనివారం ఉదయం సోదాలు చేపట్టారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే అభియోగాల మేరకు తనిఖీలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. మురళీనగర్‌లోని వెంకట్రావ్ నివాసంతోపాటు.. ఆయన బంధువులు, సన్నిహితుల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు కొనసాగుతున్నాయి. మొత్తం 9 చోట్ల సోదాలు చేపట్టినట్లు అనిశా అధికారులు తెలిపారు. పలు విలువైన పత్రాలు, నగలు, నగదును గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.




