Tuesday, 3 November 2026

ఎస్ఐని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టించిన భార్య..

హైదరాబాద్ : ఒక బాధ్యాతయుతమైన స్థానం..అందులో పోలీసు ఉద్యోగం..ఇతరులకు మార్గదర్శకంగా ఉండాల్సిన ఆ పోలీసు తప్పుదారిపట్టాడు. ఏడు అడుగులు నడిచిన భార్యను మోసం చేశాడు. మరో భార్యతో సంబంధం పెట్టుకున్నాడు. ముప్పుతిప్పలు పెట్టిన ఈ పోలీసు వ్యవహారాన్ని బాహ్య ప్రపంచానికి తెలియచెప్పాలని అనుకుంది. అనుకున్న విధంగా సక్సెస్ అయ్యింది. తాను అతనితో జీవించనని విడాకలు తీసుకుంటానని..తనకు న్యాయం కావాలిన ఆ మహిళ వేడుకొంటోంది. వివరాల్లోకి వెళితే…
అఫ్జల్‌గంజ్ ఎస్ఐ కరుణాకర్‌కు నల్లగొండ జిల్లా హూజూర్‌నగర్‌కు చెందిన మహిళతో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది.. ఓ పాప పుట్టాక కరుణాకర్ మరో మహిళతో సంబంధం ఏర్పాటుచేసుకున్నాడు. ఎన్నిసార్లు చెప్పినా వినకపోగా భార్యను ముప్పుతిప్పలు పెట్టాడు. దీంతో ఆగ్రహించిన ఆ భార్య… భర్త వేరే కాపురం పెట్టిన డీడీ కాలనీ అపార్ట్ మెంట్ వద్దకు చేరుకుంది. పోలీసులకు తన భర్తను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టించి ఇచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *