Tuesday, 3 November 2026

మాజీ ఎంపీ రాజయ్య ఇంట్లో పెను విషాదం

C

– అగ్ని ప్రమాదంలో కోడళు, మనవళ్లు సజీవ దహనం

– పోలీసుల ముమ్మర దర్యాప్తు

– పోటీ నుంచి తప్పుకున్న రాజయ్య

వరంగల్‌,నవంబర్‌4(జనంసాక్షి):

కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి సిరిసిల్ల రాజయ్య ఇంట్లో దారుణ సంఘటన చోటు చేసుకుంది. కనీవినీ ఎరుగని విషాదం నెలకొంది. హన్మకొండలోని ఆయన ఇంట్లో జరిగిన అగ్నిప్రమాదంలో రాజయ్య కోడలు, ముగ్గురు పిల్లలు సజీవదహనమయ్యారు. మృతులు సారిక, అభినవ్‌, ఆయోన్‌, శ్రీయోన్‌లుగా గుర్తించారు. అగ్ని ప్రమాదంలో నలుగురు సజీవ దహనం కావడంతో వరగంల్‌లో  విషాద ఛాయలు అలుముకున్నాయి. ఓ వైపు ఎన్నికలు జరుగుతన్న వేళ ఆయన అభ్యర్తిగా పోటీకి దిగిన వేళ ఈ విషాదం నెలకొంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ప్రమాదం ఎలా జరిగిందన్నది ఇప్పటికీ మిస్టరీగానే మారింది. గ్యాస్‌ పేలిందని కొందరు తమ కూతురును హత్యచేశారని సారిక తల్లిదండ్రులు చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో జాగిలాలతో పోలీసులు రంగంలోకి దగారు. ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని మంటలు ఆర్పివేశారు. వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సుధీర్‌బాబు ఘటనాస్థలిని పరిశీలించారు. ప్రమాదం జరిగిన సమయంలో రాజయ్యతో పాటు ఆయన కుమారుడు అనిల్‌ కూడా ఇంట్లోనే ఉన్నట్లు సమాచారం.రాజయ్య ఇంట్లో అగ్ని ప్రమాదంపై స్థానికులు ఆనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లో ముగ్గురు పిల్లలతో కోడలు ఒక్కతే ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. రాజయ్య దంపతులు, కుమారుడు వేరే ఇంట్లో ఉంటారని తెలిపారు. ఎప్పుడూ గొడవలు జరుగుతూ ఉండేవని స్థానికుల సమాచారం. రాజయ్య కోడలు ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, గ్యాస్‌ పేలితే బిల్డింగ్‌ మొత్తం మంటలు వస్తాయి కదా అన్న వాదనను స్థానిక మహిళలు వినిపిస్తున్నారు. పిల్లలకు చిన్న ముల్లు గుచ్చుకున్నా తట్టుకోలేకపోయేదని, అటువంటి సారిక పిల్లలను చంపి ఎందుకు ఆత్మహత్య చేసుకుంటుందని వాదిస్తున్నారు. ఏడాది నుంచి ఇంట్లో పిల్లలతో కోడలు మాత్రమే ఉంటుందని పని మనిషి తెలిపింది.

రాజయ్య కొడుకుతో సారికది లవ్‌ మ్యారేజ్‌

2002 సంవత్సరంలో రాజయ్య కొడుకు అనిల్‌తో సారికకు పరిచయం ఏర్పడింది. 2006లో అనిల్‌, సారిక ప్రేమ వివాహంజరిగింది. రాజయ్య కోడలు సారికది నిజామాబాద్‌ జిల్లా. సారిక బీసీ సామాజిక వర్గానికి చెందినది. తనను, తన పిల్లలను సరిగా చూసుకోవడం లేదని, గతంలో అనేక సార్లు సారిక నిరసనకు దిగింది. అనంతరం కోర్టులో కేసు వేయగా అది విచారణ కొనసాగుతోంది. తిండికి, పిల్లల ఫీజులకు కూడా సారిక ఇబ్బంది పడేదని స్థానికులు చెబుతున్నారు. ఘటనా స్థలాన్ని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సుధీర్‌బాబు సందర్శించారు. గతంలో రాజయ్య కుటుంబంపై సారిక 498 కేసు పెట్టింది. జిల్లాకు చెందిన కాంగ్రెస్‌ నాయకులు, స్థానికులు పెద్ద ఎత్తున ఘటన జరిగిన రాజయ్య ఇంటి ప్రాంతానికి చెరుకున్నారు. అగ్ని మాపక సిబ్బంది మంటలను పూర్తిగా అదుపు చేశారు.

కాంగ్రెస్‌ అభ్యర్థి మార్పు

సిరిసిల్ల రాజయ్య ఇంట్లో విషాద సంఘటన నేపథ్యంలో కొత్త కోణం వెలుగు చూసింది. రాజయ్య ప్రస్తుత పరిస్థితుల్లో పోటీ చేయడం తగదని భావించిన కాంగ్రెస్‌ అధిష్టానం సర్వే సత్యనారాఆయణనురంగంలోకి

దింపింది. రాజయ్యకు టికెట్‌ ఇవ్వొద్దని నాలుగు రోజుల క్రితం రాజయ్య కోడలు సారిక ఏఐసీసీకి లేఖ రాసినట్లు సమాచారం. ముగ్గురు పిల్లలు సహా తనను రోడ్డున పడేశారని లేఖలో సారిక ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఉప ఎన్నికల నేపథ్యంలో రాజయ్య రెండు రోజుల క్రితం ఆ ఇంటికి వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. సారికకు ఇల్లు వదిలేసి రాజయ్య కుటుంబం దూరంగా వేరే ఇంట్లో ఉంటుంది.

ఓ మహిళతో రాజయ్య కుమారుడు అనిల్‌ వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు  స్థానికులు ఆరోపిస్తున్నారు. రాత్రి కోడలితో రాజయ్య గొడవ పడినట్లు సమాచారం. మళ్లీ ఆందోళన చేస్తానని రాజయ్యను సారిక హెచ్చరించినట్లు తెలిసింది. రాజయ్య, కోడలు సారిక మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ జరిగినట్లు కాలనీవాసులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వారిది హత్యా, ఆత్మహత్యా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అనుమానాస్పద స్థితిలో బెడ్‌రూంలో మృతదేహాలు కాలిపోయి ఉన్నాయి. గ్యాస్‌ లీకైన కారణంగానే కాలిపోయి చనిపోయారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. బెడ్‌ రూంలో రెండు సిలిండర్లు ఎందుకు ఉన్నాయి. గ్యాస్‌ ఏలా లీకైంది? అన్న కోణంలో కొనసాగుతోంది. ఘటనా స్థలంలో అగ్నిప్రమాద ఆనవాళ్లు లేవని పోలీసులు అంటున్నారు. గ్యాస్‌ సారిక లీక్‌ చేసిందా… మరెవరైనా లీక్‌ చేశారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్‌ టీం, డాగ్‌ స్క్వాడ్‌లతో ఆధారాలు సేకరిస్తున్నారు. సారిక ఆత్మహత్య కేసుకునేంత పిరికిది కాదని ఆమె తల్లిదందడ్రులుతండ్రి వాదిస్తున్నారు. సారికను హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నిజామాబాద్‌లో ఉన్న వారు హుటాహుటిన వరంగల్‌కు బయలుదేరారు.

రాజయ్య కోడలు,మనవల మృతిపై దర్యాప్తు ముమ్మరం

మహిళా సంఘాల ధర్నా…అరెస్ట్‌కు డిమాండ్‌

సిరిసిల్ల రాజయ్య కోడలు, మనుమల సజీవ దహనంపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. రాజయ్య ఇంటికి నగర పోలీస్‌ కమిషనర్‌ సుధీర్‌బాబు, డీఎస్పీ, క్లూస్‌టీమ్‌లు చేరుకుని దర్యాప్తు చేపట్టారు. గ్యాస్‌ లీకేజీతోనే మంటలు వ్యాపించినట్లు ప్రాథమికంగా నిర్థారించారు. అయితే రాజయ్య కుమారుడు అనిల్‌ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఈ సందర్భంగా సీపీ సుధీర్‌బాబు విూడియాతో మాట్లాడుతూ… బెడ్‌రూమ్‌లో సిలిండర్‌ లీకేజీ వల్లే మంటలు చెలరేగాయని తెలిపారు. నలుగురు పూర్తిగా కాలిపోయారని పేర్కొన్నారు. గ్యాస్‌ ఎలా లీకైందన్న విషయంపై ఇంకా నిర్థారణకు రాలేదని, వివరాలు . దర్యాప్తులో తేలుతాయని వెల్లడించారు. అయితే ఇప్పటికే రాజయ్య కుమారుడు అనిల్‌ను రెండు దఫాలుగా పోలీసులు ప్రశ్నించారు. మంగళవారం రాత్రి ఇంట్లో ఏం జరిగింది?…ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరెవరు ఉన్నారనే దానిపై ఆరా తీశారు. అలాగే గతంలో చోటు చేసుకున్న పరిణామాలపై అనిల్‌ను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. మరోవైపు రాజయ్య ఇంట్లో అగ్ని ప్రమాదంపై స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ముగ్గురు పిల్లలతో కోడలు ఒక్కతే ఉంటుందని…రాజయ్య దంపతులు, కుమారుడు అదే ఇంట్లో వేరుగా ఉంటున్నారని తెలిపారు. ఎప్పుడూ గొడవలు జరుగుతూ ఉండేవని స్థానికులు సమాచారం అందించారు. సారిక ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని వారు చెబుతున్నారు. గ్యాస్‌ పేలితే పెద్ద శబ్దం వచ్చేదని స్థానికులు అనుమానిస్తున్నారు. పిల్లలకు చిన్న ముల్లు

గుచ్చుకున్నా తట్టుకోలేకపోయే సారిక…పిల్లలను చంపి ఎందుకు ఆత్మహత్య చేసుకుంటుందని ప్రశ్నిస్తున్నారు. ఏడాది నుంచి ఇంట్లో పిల్లలతో సారిక మాత్రమే ఉంటుందని పనిమనిషి చెబుతోంది. అయితే  ఘటనపై అన్ని కోణాలలో విచారణ జరుపుతున్నామని పోలీస్‌ జిల్లా ఎస్పి సుదీర్‌ బాబు చెప్పారు. కాగా అక్కడ మహిళా సంఘాలు నిరసన తెలుపుతూ ఇది హత్య అని ఆరోపించాయి. వెంటనే రాజయ్యను, ఆయన కుటుంబ సభ్యలును అరెస్ట్‌ చేయాలని వారు ఆందోళనకు దిగారు. ఇంటిముందు బైఠాయించినినాదాలుచేశారు. కాగా బెడ్‌ రూమ్‌ లో మృతదేహాలు ఉండడం, బెడ్‌ రూమ్‌ లో రెండు సిలిండర్లు ఎలా ఉన్నాయన్న ప్రశ్న వస్తోంది. గాస్‌ లీక్‌ అయిందా?లేక ఎవరైనా లీక్‌ చేశారా అన్న దానిపై తర్జనభర్జన జరుగుతోంది. మృతదేహాలు పూర్తిగా కాలిపోయి బూడిదగా మారిపోవడంతో సంచిలో వాటిని ఎత్తి పరీక్ష చేయవచ్చని చెబుతున్నారు. కాగా సారిక భర్త అనిల్‌, అలాగే మామ రాజయ్య లను పోలీసులు అదుపులోకి తీసుకోవచ్చని కధనాలు వస్తున్నాయి. జిల్లా కలెక్టర్‌ కరుణ కూడా వచ్చి పరిస్థితిని పరిశీలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *