Tuesday, 3 November 2026

ఎస్సారెస్పీపై సిఎం కెసిఆర్‌ సవిూక్ష

హాజరైన ఎమ్మెల్యేలు, ఎంపిలు
పాల్గొన్న నీటిపారుదల అధికారులు
హైదరాబాద్‌,ఫిబ్రవరి7(జ‌నంసాక్షి): కోటి ఎకరాల మాగాణమే లక్ష్యంగాముందుకు సాగుతున్న సిఎం కెసిఆర్‌ ప్రాజెక్టుల పనితీరుపై దృష్టి సారించారు. ఇటీవల కాళేశ్వరం ప్రాజెక్టును స్వయంగా పరిశీలించిన సిఎం కెసిఆర్‌ ఎస్సారెస్పీ ప్రాజెక్టుపై .. ప్రగతిభవన్‌లో  సవిూక్షించారు. సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించిన ఆయన..  పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఎస్సారెస్పీ అధికారులు మంత్రులతో సవిూక్ష నిర్వహిస్తున్న కేసీఆర్‌ ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం పనులపై చర్చించారు. ఈ భేటీకి.. మాజీ మంత్రులు ఈటెల రాజేందర్‌, జగదీష్‌ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు , ఎంపీ సంతోష్‌ కుమార్‌, సీఎస్‌ ఎస్కే జోషీ, ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌ శర్మ , ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఎస్సారెస్పీ పునర్జీవ పథకం, కాకతీయ కాల్వ ఆధునీకరణ.. తదితర పనుల పురోగతిపై బుధవారం జలసౌధలో జరిగిన సవిూక్షలో పలువురు ప్రజాప్రతినిధులు, నీటిపారుదలశాఖ అధికారులు భేటీ అయ్యారు. పనుల పురోగతిపై సమగ్రంగా చర్చించారు. దీనికి కొనసాగింపుగా సిఎం కెసిఆర్‌ ఆయకట్టు పరిధిలోని ఎమ్మెల్యేలు, నీటిపారదుల శాఖ అధికారులు కూడా ఇందులో పాల్గొన్నారు. శ్రీరాంసాగర్‌ జలాశయంలో ప్రస్తుతం 30 టీఎంసీల నీరుందని, ఇదివరకే ఎల్‌ఎండీ ఎగువన ఉన్న ఆయకట్టుకు నీరందించామని, ఈ నెల పదో తేదీ నుంచి ఎల్‌ఎండీ దిగువకు 10 టీఎంసీల నీటిని విడుదల చేస్తామని మాజీ మంత్రి, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ఇప్పటికే స్పష్టం చేశారు. ఎల్‌ఎండీ ఎగువన నాలుగు తడులుగా 20 టీఎంసీల నీటిని అందించనుండగా.. దిగువన ఉన్న ఆయకట్టుకు రెండు తడుల కింద నాలుగు టీఎంసీలు ఇస్తామని తెలిపారు. ఎస్సారెస్పీ కింద వాస్తవానికి 14.40 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా.. సమైక్య పాలకులు ఏనాడూ ఐదు లక్షల ఎకరాలకు మించి సాగునీరు అందించలేదని పేర్కొన్నారు.  ఎస్సారెస్పీ ఆయకట్టు పరిధిలో చివరి భూముల వరకు ప్రతి ఎకరాకూ నీళ్లందించేందుకు యుద్ధప్రాతిపదికన పనులు పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. ఈ దశలో వాస్తవ పరిస్థితులను సిఎం అడిగి తెలుసుకున్నారు. ఇందు కోసం డిస్టిబ్యూట్రరీలనూ బలోపేతం చేసుకుంటున్నట్టు చెప్పారు. అధికారికంగా చెరువులు, కుంటలు నింపాలని సీఎం కేసీఆర్‌ సూచించారని తెలిపారు. సమావేశపు సమగ్ర నివేదికను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు సమర్పించారు. దీనిపై సిఎం వివరాలు తెలుసుకున్నారు.