హైదరాబాద్,ఫిబ్రవరి7(జనంసాక్షి): ప్రముఖ వ్యాపారవేత్త జయరాం హత్య కేసు తెలంగాణ పోలీసులకు బదిలీ అయింది. ఆంధ్రప్రదేశ్ నందిగామ పోలీసులపై నమ్మకం లేదనీ., కేసును తెలంగాణ పోలీసులు విచారించాలన్న జయరాం భార్య పద్మశ్రీ కోరిక నెరవేరింది. నందిగామ ఎస్పీ నుంచి కేసు డైరీని తెలంగాణ సీపీ అంజనీకుమార్ తీసుకున్నారు. కేసును బంజరాహిల్స్ ఏసీపీకి అప్పగిస్తున్నట్లు సీపీ అంజనీకుమార్ తెలిపారు. చట్ట ప్రకారం కేసు దర్యాప్తు కొనసాగిస్తామని ఆయన తెలిపారు. మరో వైపు తెలంగాణ పోలీసులు తప్పకుండా తనకు న్యాయం చేస్తారంటూ జయరాం భార్య పద్మశ్రీ నమ్మకం వెల్లబుచ్చారు.
జూబ్లీహిల్స్ పోలీసులకు జయరామ్ కేసు బదిలీ




