Tuesday, 3 November 2026

ఎస్సీ సహకార అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా పిడమర్తి రవి

7

హైదరాబాద్‌, డిసెంబర్‌ 3 (జనంసాక్షి) : ఎస్సీ సహకార అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా ఓయూ జేఏసీ నేత పిడమర్తి రవి నియమితులయ్యారు. ఈ సంస్థలో మరో 15 మంది సభ్యులుగా కొనసాగనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. గతంలో తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న రవి ఎన్నికలకుముందు టిఆర్‌ఎస్‌లో చేరారు. ఖమ్మం జిల్లా నుంచి పోటీచేసి ఓడిపోయారు. దీంతో ఆయన సేవలను గుర్తించిన సిఎం కెసిఆర్‌ ఆయనకు ఛైర్మన్‌ పదవి కట్టబెట్టారు. ఇదిలావుంటే తెలంగాణలో తాగునీటి సమస్యను తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం వాటర్‌గ్రిడ్‌ ప్రాజెక్టును ప్రవేశపెట్టిన విషయం విదితమే. రాబోయే రోజుల్లో తాగునీటి సమస్యలు లేకుండా చేసేందుకు ప్రభుత్వం వాటర్‌గ్రిడ్‌కు సంబంధించి పనులను వేగవంతం చేస్తోంది. వాటర్‌గ్రిడ్‌ కోసం 662 మంది వర్క్‌ ఇన్‌స్పెక్టర్లు, 47మంది అసిస్టెంట్లను పొరుగు సేవల (ఔట్‌ సోర్సింగ్‌)కింద నియమించుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఎస్‌ఈ స్థాయి అధికారులకు 26 వాహనాలు కొనుగోలుకు కూడా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *