Tuesday, 3 November 2026

మావోయిస్టులపై పోరు కొనసాగుతుంది : రాజ్‌నాథ్‌సింగ్‌

6

న్యూఢిల్లీ, డిసెంబర్‌ 3 (జనంసాక్షి) : మావోయిస్టులపై ఏరివేత పోరు కొనసాగుతుందని కేంద్ర ¬ంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అన్నారు. ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌ ఘటనపై బుధవారం రాజనాధ్‌ ఉభయసభల్లో ఈ మేరకు ప్రకటన చేశారు. బహుముఖ విధానాల్లో మావోయిస్టులను అరికడతామని రాజ్‌నాథ్‌ చెప్పారు. ఇందుకోసం భద్రత బలగాలకు, రాష్ట్ర ప్రభుత్వాలకు అవసరమైన సాయం చేస్తామని తెలిపారు. నవంబర్‌ 16 నుంచి చత్తీస్గఢ్లోని సుకుమా జిల్లా అటవీప్రాంతంలో ఆపరేషన్‌ కొనసాగుతోందని మంత్రి చెప్పారు. 2253 సీఆర్పీఎఫ్‌ జవాన్లు, 224 మంది రాష్ట్ర పోలీసులు పాల్గొంటున్నారని వెల్లడించారు. భద్రత సిబ్బంది, మావోయిస్టుల మధ్య పలుమార్లు ఎదురు కాల్పులు జరిగాయని చెప్పారు. గత నెల 21న 12 మంది మావోయిస్టులను హతమార్చినట్టు సమాచారం ఉందని, అయితే ఈ విషయం ఇంకా ధ్రువపడలేదని మంత్రి తెలిపారు. ఈ నెల 1న భద్రత సిబ్బంది బేస్‌ క్యాంప్‌ కు వస్తుండగా మావోయిస్టులు కాల్పులు జరిపారని చెప్పారు. మావోల చర్యనుఎ పిరికిపంద చర్యగా ఆయన పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *