Tuesday, 3 November 2026

ఎస్‌ఐ ఆత్మహత్య టీఆర్‌ఎస్ అవినీతికి పరాకాష్ట

2609_Nagamహైదరాబాద్: రాష్ట్రంలో అవినీతి తీవ్రంగా పెరిగిందనడానికి మెదక్ జిల్లాలో ఎస్‌ఐ ఆత్మహత్య చేసుకోవడం పరాకాష్ట అని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, డీఎస్‌పీ, సీఐతో సహా ఉన్నతాధికారుల వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నట్టుగా తన సూసైడ్ నోట్‌లో ఎస్‌ఐ రాసినా ఇంకా కేసు నమోదు చేయకపోవడం.. అవినీతికి ప్రభుత్వమే అండగా ఉంటుందని చెప్పడానికి నిదర్శనమన్నారు. దీనిపై వెంటనే న్యాయ విచారణ జరిపించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *