ఎస్‌బిఐ ముందు రైతుసంఘం ధర్నా
విజయవాడ,మే14(జనం సాక్షి): బ్యాంకుల్లో నోట్ల కొరతను పరిష్కరించాలని, ఏటీఎంలో తగినంత నగదు ఉంచాలని ఎపి రైతు సంఘం ఆధ్వర్యంలో ఉయ్యూరు ఎస్‌బిఐ బ్యాంకు వద్ద సోమవారం ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ ధర్నాకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు, మాజీమంత్రి శోభనాద్రీశ్వరరావు సిపిఐ నాయకులు విజయకుమార్ ధర్నాకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ ప్రభుత్వం సమస్యను వెంటనే పరిష్కరించుకుంటే రాష్ట్రవ్యాప్త ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు.