Wednesday, 4 November 2026

ఏఎస్‌ఐ ఆత్మహత్యాయత్నం

– స్టేషన్‌ ముందే ఘాతుకం

– బాలాపూర్‌ ఎఎస్సై ఆత్మహత్యా యత్నం

హైదరాబాద్‌,నవంబర్‌ 22(జనంసాక్షి): బాలాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ దగ్గర కలకలం రేగింది. ఎఎస్సై నరసింహ పెట్రోల్‌ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. నరసింహకు తీవ్ర గాయాలు కావటంతో డీఆర్డీవో అపోలోకు తరలించారు. ఎఎస్సై నరసింహ శరీరానికి 25 శాతం కాలిన గాయాలయ్యాయని సమాచారం. ఒక కేసు విషయంలో తనకు సంబంధం లేకపోయినా ఉన్నతాధికారులు వేధింపులకు పాల్పడటంతో నరసింహ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని సమాచారం. తనపై తప్పుడు రిపోర్ట్‌ ఇచ్చారని మనస్తాపం చెందిన నరసింహ పోలీస్‌ స్టేషన్‌ ముందే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పెట్రోల్‌ బాటిల్‌ లోని పెట్రోల్‌ ను తనపై పోసుకొని నరసింహ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీస్‌ స్టేషన్‌ సిబ్బంది మంటలార్పి నరసింహను రక్షించారు. సిబ్బంది వెంటనే సవిూపంలోని డీఆర్డీవో ఆస్పత్రికి తరలించారు. డీఆర్డీవో వైద్యులు నరసింహకు ప్రాణాపాయం అయితే లేదని చెబుతున్నారు. ఏదైనా కేసుకు సంబంధించిన సమస్యలు ఉంటే ఉన్నతాధికారులు పూర్తి స్థాయిలో పరిశీలించి సమస్యను పరిష్కరించాలి కానీ తనకు ఏ మాత్రం సంబంధం లేని కేసులో తప్పుడు రిపోర్టు ఇవ్వడంతో ఎఎస్సై నరసింహ మనస్తాపానికి గురయ్యాడని తెలుస్తోంది. సీఐ సైదులు వేధించినట్లు ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారులు విచారణ ఇప్పటికే మొదలుపెట్టారని తెలుస్తోంది. కొన్నిరోజుల క్రితం ఎఎస్సై నరసింహను బాలాపూర్‌ నుండి మంచాల పీఎస్‌ కు బదిలీ చేశారు. ఈ బదిలీకి కూడా సీఐ సైదులు కారణమని నరసింహ ఆరోపణలు చేసినట్లు సమాచారం. కొన్ని ఆరోపణలు వచ్చినందువలనే నరసింహను ఉన్నతాధికారులు బదిలీ చేశారని సమాచారం. ప్రస్తుతం నరసింహకు అత్యవసర వైద్య విభాగంలో చికిత్స అందుతోంది. పోలీసులు ఏఎస్సై కుటుంబసభ్యులకు నరసింహ ఆత్మహత్యాయత్నం గురించి సమాచారం అందించారు. ఏఎస్సై స్థాయి అధికారి ఆత్మహత్యకు పాల్పడటంతో ఈ ఘటన కలకలం రేపుతోంది. ఉన్నతాధికారులు ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది. సకాలంలో సిబ్బంది ఏఎస్సైని రక్షించడంతో ఏఎస్సై నరసింహ ప్రాణాపాయం నుండి తప్పించుకున్నాడు.

తప్పుడు రిపోర్ట్‌ ఇచ్చాడని మనస్థాపం చెంది..

బాలాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఏఎస్సై నరసింహను రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ పరామర్శించారు. ప్రస్తుతం నరసింహ అపోలో డీఆర్‌డీవో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మహేష్‌ భగవత్‌ మాట్లాడుతూ.. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన నరసింహకు అపోలో వైద్యులు మెరుగైన చికిత్స అందిసున్నారని తెలిపారు. అయితే సీఐ సైదులు తనపై తప్పుడు రిపోర్టు ఇచ్చాడని నరసింహ ఆరోపించిన వ్యాఖ్యలను మేము పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. దీంతో పాటు నరసింహ కుటుంబసభ్యులు ఇచ్చిన సమాచారాన్ని కూడా తీసుకున్నట్లు తెలిపారు. అయితే బాలాపూర్‌ సీఐ సైదులు, కానిస్టేబుల్‌ దశరథ్‌లను బదిలీ చేసి సీపీ ఆఫీస్‌కు అటాచ్‌ చేశామని తెలిపారు. తదుపరి విచారణలో వీరిద్దరి ప్రమేయం ఉంటే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ వెల్లడించారు.నగరంలోని బాలాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో శుక్రవారం ఏఎస్సై నరసింహ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఒక కేసు విషయంలో తనకు సంబంధం లేకున్నా ఉన్నతాధికారులకు తప్పుడు రిపోర్ట్‌ ఇచ్చాడని నరసింహ పెట్రోల్‌ పోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. దీంతో 30 శాతం కాలిన గాయాలతో ఉన్న నరసింహను అపోలో డీఆర్‌డీవో ఆసుపత్రికి తరలించారు. వివరాలు.. ఇటీవల బాలాపూర్‌ సీఐ తనను వేధిస్తున్నాడంటూ అదే స్టేషన్‌లో ఏఎస్సై గా పనిచేస్తున్న నరసింహ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే అతని ఫిర్యాదును పట్టించుకోకుండా నరసింహను బాలాపూర్‌ నుంచి మంచాలకు ట్రాన్స్పర్‌ చేశారు. తన తప్పు లేకున్నా సీఐ ఇచ్చిన తప్పుడు రిపోర్టుతో తనను అక్రమంగా బదిలీ చేశారని మనస్థాపం చెందాడు. దీంతో శుక్రవారం నరసింహ పెట్రోల్‌ బాటిల్‌తో బాలాపూర్‌ పీఎస్‌కు చేరుకొని ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తుంది.